
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
సారంగాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నా రు. బీర్‌పూర్ మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. తరగతి గదిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు..? ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా..? అని పరిశీలించారు. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని పేర్కొన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా బోధన ఉండాలన్నారు. ఆరో తరగతికి చెందిన గణేష్, రిశ్వంత్‌తో హిందీ పాఠ్యపుస్తకం చదవించి, సంతృప్తి వ్యక్తం చేశారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు లైబ్రరీలో ఉండగా.. వారితో మాట్లాడారు. స్టోరీ బుక్కులు చదువుతున్నారా తెలుసుకున్నా రు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాల ని, మెనూ ప్రకారం అందించాలని నిర్వాహకుల కు సూచించారు. అనంతరం ప్రాథమిక ఉప కేంద్రాన్ని సందర్శించారు. వైద్యసిబ్బందితో మాట్లా డి అన్నిరకాల మందులు నిలువ ఉంచాలని సూచించారు. అనంతరం మండలకేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో డీపీవో మదన్‌మోహన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీని వాస్, హౌసింగ్ డీఈ భాస్కర్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో భీమేష్, ఎంఈవో నాగభూషణం ఉన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్