
రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించిన వ్యక్తి అరెస్ట్
గోదావరిఖని: తనకు రూ.10 లక్షల ఇవ్వాలని వ్యాపారులకు ఫోన్‌చేసి బెదిరించిన యాదనవేని తిరుపతి అనే హమాలీని అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక కల్యాణ్‌నగర్‌కు చెందిన ఇద్దరు వ్యాపారులకు ఈనెల 18న ఫోన్‌చేసి తలా రూ.10లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో కుటుంబ సభ్యులకు హాని చేస్తానని తిరుపతి బెదిరించాడు. గతంలో ఓవ్యక్తిని కూడా మర్డర్ చేశానని, మీ ఫ్యామిలీకి కూడా ఇదేగతి పడుతుందని హెచ్చరించాడు. దీంతో బాధితులు ఈనెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌కాల్స్ ఆధారంగా ఎస్సై రమేశ్ దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు స్థానిక చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన యాదనవేని తిరుపతిగా గుర్తించి మంగళవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా, మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామం కాన్కూర్‌కు చెందిన తిరుపతి ఐదేళ్లుగా కిరాణాల్లో హమాలీగా పనిచేస్తున్నాడు. ఇటీవల చంద్రశేఖర్‌నగర్‌లో ఇల్లు కొనుగోలు చేసి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కిరాణా షాపుల యజమానుల కదలికలు గమనించి సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో బెదిరింపు కాల్స్ చేసినట్లు సీఐ వివరించారు.
గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి వెల్లడి