కొడిమ్యాల: బీసీ రిజర్వేషన్‌పై కాంగ్రెస్, బీజేపీకి చిత్తశుద్ధి లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవే టు ఫంక్షన్ హాల్‌లో పలువురు బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా.. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవి శంకర్‌తో కలిసి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం వినోద్‌కుమార్ మాట్లాడుతూ బీసీల పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఇరుపార్టీల ఎంపీలు ఢిల్లీ పెద్దలను ఒప్పించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్డ్ ద్వారా ఆమోదం పొందవచ్చని తెలిపారు. రవి శంకర్ మాట్లాడూతూ.. కాంగ్రెస్ హామీల్లో ఏ ఒ క్కటీ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం పోయందని, వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, మాజీ జె డ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్‌గౌడ్ పాల్గొన్నారు.