మురుగుతోనే సావాసం | - | Sakshi
Sakshi News home page

మురుగుతోనే సావాసం

Jul 29 2025 8:08 AM | Updated on Jul 29 2025 8:30 AM

జగిత్యాల: జిల్లాలో మూడురోజులుగా కురిసిన ముసురువానకే డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. మరోవైపు ఖాళీ స్థలాల్లోకి మురికినీరు చేరింది. డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. సోమవారం వర్షం తగ్గుముఖం పట్టడంతో మురుగుకాలువల్లో నీరు తగ్గినా.. మురుగు మాత్రమే అలాగే మిగిలిపోయింది. అధికారులు వెంటనే చర్యలు చేపట్టకపోతే వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. డ్రెయిన్‌లు సక్రమంగా లేకపోవడంతో కొట్టుకొచ్చిన చెత్త అంతా నిండిపోతోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను కూడా అందులోనే వేస్తుండడంతో మురికినీరు ముందుకు కదలడం లేదు. వర్షం తగ్గుముఖం పట్టిన క్రమంలో నీరు కొద్దికొద్దిగా వెళ్లిపోయినా మురుగుతో కూడిన చెత్తాచెదారం పేరుకుపోయింది. దీంతో దోమలు, ఈగలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ అధికారులతో సమీక్షించి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీల్లో ఆయిల్‌బాల్స్‌ వేయించాలని ఆదేశించారు.

కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి

జిల్లాకేంద్రంలోని పారిశుధ్యంపై కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం పలు మురికికాలువలను పరిశీలించి వెంటనే చెత్తాచెదారం తొలగించాలని, కాలువల్లోని ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. పిచ్చిమొక్కలు తొలగించాలని సూచించారు.

కాలనీల్లో పర్యటించి కాలువలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని గొల్లపల్లి రోడ్‌లోగల ఆస్పత్రుల సమీపంలో ఉన్న డ్రైనే జీ. సరిగా లేకపోవడంతో నీరు రోడ్లపైకి వస్తోంది. ఇటీవలి ముసురుతో ఖాళీ స్థలా లు, డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. కాలువులు శుభ్రం చేసి ఆయిల్‌బాల్స్‌ వేస్తేనే వ్యాధులకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని కాలనీవాసులు అంటున్నారు.

ఇది జిల్లాకేంద్రంలోని మోతెరోడ్‌కు వెళ్లే సమీపంలోని డ్రైనేజీ. నీరు సాఫీగా వెళ్లకపోవడంతో మురుగునీరు నిలిచే ఉంటోంది. ఆ నీటిని తొలగించకుంటే దోమలు, పందులు స్వైర విహారం చేస్తాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది బైపాస్‌రోడ్‌లో గల డ్రైనేజీ. అందులో చెత్తాచెదారం పడేయడం స్థానికులకు శాపంగా మారింది. సమీపంలో నివాసాలు, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పిల్లలు, ప్రజలు వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. ఆ ప్రాంతమంతా క్లోరినేషన్‌ చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.

ఇటీవలి వర్షాలకు సాయిబాబా ఆలయం ఎదుట గల డ్రైనేజీ పూర్తిగా నిండింది. కార్మికులు సిల్ట్‌ తీసినా నీరు సాఫీగా ప్రవహించడం లేదు. సమీపంలోని ఇళ్లలోకి చేరుతోంది. అధికారులు స్పందించి నీటిని బయటకు వెళ్లేలా చేసి క్లోరినేషన్‌ చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇది గోత్రాలకాలనీకి వెళ్లే రోడ్డు. ఇక్కడ డ్రైనేజీ లేదు. ఆ ప్రాంతమంతా కొట్టుకొచ్చిన చెత్తాచెదారంతో నిండిపోయింది. దుర్వాసన మధ్య కాలనీవాసులు ఉండలేకపోతున్నారు. దోమలు విపరీతంగా వస్తున్నాయి. అక్కడ డ్రైనేజీ నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు. కొన్ని విష పురుగులు వస్తున్నాయంటున్నారు.

మురుగుతోనే సావాసం1
1/4

మురుగుతోనే సావాసం

మురుగుతోనే సావాసం2
2/4

మురుగుతోనే సావాసం

మురుగుతోనే సావాసం3
3/4

మురుగుతోనే సావాసం

మురుగుతోనే సావాసం4
4/4

మురుగుతోనే సావాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement