
ఆండాళ్ అమ్మవారికి పంచామృతాభిషేకం
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శావ్రణ సప్తాహంలో భాగంగా సోమవారం ఆండాళ్ తిరునక్షత్రం నిర్వహించారు. గోదాదేవికి పంచామృతాభిషేకం నిర్వహించారు. విశేష భోగాలతో నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు రఘు, ఉప ప్రధాన అర్చకులు మారుతీ ప్రసాద్, రాంచంద్ర ప్రసాద్, అర్చకులు అనిల్‌కుమార్, రాంచందర్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, పర్యవేక్షకులు అశోక్ పాల్గొన్నారు.
యూరియా కోసం రైతుల తిప్పలు
ఇబ్రహీంపట్నం: మొక్కజొన్న రైతులు యూరి యా కోసం తిప్పలు పడుతున్నారు. పంట చివరి దశకు చేరడంతో యూరియా తప్పనిసరి. అయితే ఎరువు దొరక్కపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. మండలకేంద్రంలోని సహజ ఎఫ్‌పీవోకు 450 బస్తాల యూరియా వచ్చింది. ఇందులో 150 బస్తాలను ఇబ్రహీంపట్నం రైతులు, 300 బస్తాలు అమ్మక్కపేట రైతులకు పంపిణీ చేసేందుకు సీఈవో శ్రీధర్ సిద్ధమయ్యారు. అయితే అప్పటికే రైతులు పెద్ద ఎత్తున ఎఫ్‌పీవోకు చేరుకున్నారు. కంెపెనీలో సభ్యత్వం ఉన్నవారికే యూరియా ఇవ్వాలని గొడవకు దిగారు. దీంతో ఒక్కో రైతుకు ఆధార్, పట్టాదార్ పాస్‌బుక్ జిరాక్స్ తీసుకుని రెండుబస్తాల చొప్పున పంపిణీ చేశారు. కానీ.. చాలామంది రైతులకు యూరియా దొరకలేదు. ఇబ్రహీంపట్నం పీఏసీఎస్‌లో వారం క్రితం కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేసిన విషయం తెల్సిందే. ఓ రైతులకు ఎక్కువ బస్తాల యూరియా పంపిణీపై విచారణ కొనసాగుతోంది. ఆ సొసైటీకి యూరియా సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
హైపటైటీస్‌ను నివారిద్దాం
జగిత్యాల: హైపటైటీస్ నివారణ సాధ్యమేనని, నిర్మూలించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. ఐఎంఏ హాల్‌లో వైద్యులతో సమీక్షించారు. హైపటైటీస్‌కు గురైన వారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరోచనాలు, కంటిభాగంలోని తెలుపు రంగు పసుపుగా మారడం వంటి లక్షణాలుంటాయన్నారు. ఇందులో ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు రకాలుంటాయని, కొందరిలో ఇవి ఉన్నట్లు కూడా తెలియదన్నారు. ఇది ముదిరితే ఇబ్బందేనని, మొదట్లోనే వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్, కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా హైపటైటీస్‌ను గుర్తించిన వారికి ప్రశంస పత్రాలు అందించారు.
‘మధ్యాహ్న’ బిల్లులను మినహాయించాలి
జగిత్యాలటౌన్: మధ్యాహ్న భోజన నిర్వహణ బిల్లుల చెల్లింపులను ఈ–కుబేర్ నుంచి మినహాయించాలని 5నెలల పెండింగ్ వేతనాలు, కోడిగుడ్ల బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సులోచన మాట్లాడుతూ నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. కార్మికులకు రూ.పదివేల గౌరవవేతనం అందించాలని, యునిఫాం, ప్రమాదబీమా, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు ముత్యాల గౌరమ్మ, వెల్మలపల్లి వెంకటాచారి, పద్మ, సరిత, గంగవ్వ, రుక్మ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

ఆండాళ్ అమ్మవారికి పంచామృతాభిషేకం

ఆండాళ్ అమ్మవారికి పంచామృతాభిషేకం

ఆండాళ్ అమ్మవారికి పంచామృతాభిషేకం