
మారుతి రైస్‌మిల్ అనుమతులు రద్దు
వేములవాడరూరల్: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి మిల్లు నిర్మించిన వ్యవహారంపై పలువురి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన అధికారులు సదరు మిల్లు అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి శివారులో సర్వేనంబర్ 750లోని మల్లయ్యకుంటలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రైస్‌మిల్లును కొందరు వ్యాపారులు నిర్మించిన విషయంపై గతంలో మల్లారం మాజీ ఎంపీటీసీ సంగెం వీరారెడ్డితోపాటు పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఎట్టకేలకు ఆ మిల్లును కమర్షియల్ నుంచి అగ్రికల్చర్‌కు మార్పు చేసినట్లు వెల్లడించారు. సర్వేనంబర్ 750లో 18 ఎకరాల 18 గుంటల స్థలంలో దాదాపు 5 ఎకరాలకు మాత్రమే మిల్ యజమానులు నాలా కన్వర్షన్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మిల్లు అనుమతులను, నాలా కన్వర్షన్‌ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వరుస కథనాలతో కదలిన యంత్రాంగం
మర్రిపల్లి శివారులో నిర్మించిన మారుతి రైస్‌మిల్లు నుంచి వస్తున్న వ్యర్థాలు, కలుషితంతో ఆ ప్రాంత రైతులకు, పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయంపై శ్రీసాక్షిశ్రీలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాలపై స్పందించిన అధికారులు గతంలో పలుమార్లు విచారణ చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో మిల్లు నిర్మించినట్లు గుర్తించారు. ఎట్టకేలకు ఆ మిల్లు అనుమతులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
కమర్షియల్ నుంచి అగ్రికల్చర్‌కు మార్పు
ఆదేశాలు జారీ చేసిన అధికారులు

మారుతి రైస్‌మిల్ అనుమతులు రద్దు