
రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి
వేములవాడ: శ్రావణమాసం ఆరంభం కావడంతో శుక్రవారం శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణవ్రతాలు, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి కుంకుమపూజ, గండాదీపంలో నూనె, బద్దిపోచమ్మకు బోనం మొక్కులు పెట్టారు. అనుబంధ దేవాలయమైన మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
జల్సాలకు అలవాటు పడి.. జైలుపాలైన యువకులు
● గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరు
● 109 గ్రాముల గంజాయి స్వాధీనం
ముస్తాబాద్(సిరిసిల్ల): జల్సాలకు అలవాటుపడ్డ ఇద్దరు యువకులు డబ్బు కోసం గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం గూడెంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచా రంతో ఎస్సై గణేశ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. గూడెంలోని పెద్దమ్మ ఆలయం వద్ద అనుమానితులను పోలీసులు తనిఖీ చేశారు. వారి నుంచి 109 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గూడెంకు చెందిన సూర అజయ్(19), సూర ప్రదీప్(18) అనే యువకులుగా గుర్తించారు. ఇంటర్మీడియట్ వరకు చదివిన అజయ్, ప్రదీప్ ఉన్నత చదువులకు వెళ్లకుండా గంజాయికి, జల్సాలకు బానిసలయ్యారు. డబ్బు కోసం అదే గంజాయిని విక్రయించడం ప్రారంభించారు. పక్క సమాచారంతో పోలీసులు అజయ్, ప్రదీప్‌లను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను అనుక్షణం గమనించాలని సీఐ సూచించారు. మత్తుకు బానిసలుగా మారితే డీ–ఆడిక్షన్ సెంటర్‌కు తరలించి బాగుచేయిస్తామన్నారు.
రోడ్డుపై కేజీవీల్స్ ట్రాక్టర్
ఎలిగేడు(పెద్దపల్లి): నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై నడుపుతున్న కేజ్‌వీల్స్ ట్రాక్టర్‌ను ఎస్సై సత్యనారాయణ పట్టుకున్నారు. సుల్తాన్‌పూర్ గ్రామంలో శుక్రవారం నత పోలీసు సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో గడ్డం రాంరెడ్డికి చెందిన కేజీవీల్స్ ట్రాక్టర్ రోడ్డుపైకి రావడంతో పట్టుకుని పోలీసుస్టేషన్ తరలించారు. రెవెన్యూ అధికారులకు దానిని అప్పగించడంతో వారు రూ.5వేల జరిమానా విధించినట్లు ఎస్సై వివరించారు.

రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి

రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి

రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి