
● సీబీఎస్‌ఈ క్లస్టర్– 7 కబడ్డీ పోటీలు ప్రారంభం ● తెలుగ
కబడ్డీ.. కబడ్డీ
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ జగిత్యాల రోడ్డులోని వివేకానంద సీబీఎస్‌ఈ పాఠశాల ఆవరణలో శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీబీఎస్‌ఈ 7వ క్లస్టర్ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు తెలుగు రాష్ట్రాల్లోని సీబీఎస్‌ఈ పాఠశాలల నుంచి సుమారు 800మంది క్రీడాకారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా జిల్లా కబడ్డీ సంఘం చైర్మన్ వెలిచాల రాజేందర్‌రావు హాజరై క్రీడా పతాకాలను ఆవిష్కరించి, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కబడ్డీకి కేరాఫ్‌గా కరీంనగర్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో కేట గిరీ 14, 17, 19లో గెలుపొందిన వారికి రూ. 10వేలు, రన్నర్లకు రూ.8 వేలు, మూడో బహుమతిగా రూ.5వేలు ఇస్తానని తెలిపారు. కేటగిరీ 14, 17, 19 విభాగాల్లో రాష్ట, జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అమిత్‌కుమార్ మాట్లాడుతూ క్రీడలు మానసికంగా, శారీరకంగా ఎంతో శక్తిని ఇస్తాయని తెలి పారు. వివేకానంద పాఠశాల అకడమిక్ డైరెక్టర్ టి.లలితాకుమారి మాట్లాడుతూ కబడ్డీ ఉత్కంఠభరితమైన పోటీ క్రీడగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్‌రావు, జిల్లా కార్యదర్శి మల్లేశం గౌ డ్, రెఫరీ బోర్డు చైర్మన్ లక్ష్మీనారాయణ, వివేకానంద సీబీఎస్‌ఈ హైస్కూల్ చైర్మన్ పోల్సాని సుధాకర్, ప్రిన్సిపాల్ రేణుక, వైస్ ప్రిన్సిపాల్ ప్రశాంత్, హెచ్‌ఎం అనిత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చిత్తరంజన్, అడ్వైజరీ మెంబర్ గండ్ర లక్ష్మణరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి.సత్యనారాయణ పాల్గొన్నారు.

● సీబీఎస్‌ఈ క్లస్టర్– 7 కబడ్డీ పోటీలు ప్రారంభం ● తెలుగ