
శ్రావణ సప్తాహ ఉత్సవాలు ప్రారంభం
మల్యాల/ధర్మపురి: కొండగట్టు అంజన్న, ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో శుక్రవారం శ్రావణ సప్తాహ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కొండగట్టులో ఆంజనేయస్వామి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి, పంచామృతాభిషేకం తదితర పూజలు చేశారు. సాయంత్రం కుంకుమార్చన, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సేవ నిర్వహించారు. ఈవో శ్రీకాంత్‌రావు, ప్రధాన అర్చకులు రామకృష్ణ, జితేందర్‌స్వామి, రఘు, స్థానాచార్యులు తిరుకోవెల కపీందర్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవస్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే ధర్మపురిలో శ్రీయోగా లక్ష్మీనృసింహస్వామి, అనుబంధ ఉగ్ర వేంకటేశ్వర, రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తరలివచ్చి స్వామివారలను దర్శించుకున్నారు. ముందుగా గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించారు.