
ప్రతిరోజూ పండుగే
● శ్రావణం.. ఆధ్యాత్మిక మాసం ● ఆలయాల్లో ప్రత్యేక పూజలు ● నోములు.. వ్రతాలు.. పండుగలు
విద్యానగర్(కరీంనగర్): శ్రావణమాసం ప్రత్యేకమైనది. ఈ నెల రోజులు పూజలు, నోములు, ప్రతాలతో ఇళ్లు, గుళ్లు కళకళలాడుతాయి. శుభకార్యాలు, వివాహాలు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలకు శుభకరం. శుక్రవారం ప్రారంభమైన శ్రావణం ఆగస్టు 23న పోలాల అమావాస్యతో ముగుస్తుంది.
ఇవీ పండుగలు
ఈనెల 28 సోమవారం నాగ చతుర్థి, 29 మంగళవారం పంచమి, మంగళగౌరీ ప్రతం, 30న బుధవారం కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి, ఆగస్టు 1 శ్రావణ మాసంలో రెండో శుక్రవారం, 5న మంగళవారం ఏకాదశి, 8న వరలక్ష్మి వ్రతం, వారాహి జయంతి ఉంటుంది. 9న రాఖీ పౌర్ణమి, 12న సంకష్ట హర చతుర్థి, 16న శ్రీకృష్ణ జన్మాష్టమి, 19న కామిక ఏకాదశి, 21 గురువారం మాసశివరాత్రి, ఆగస్టు 23న పోలాల అమావాస్యతో శ్రావణం ముగుస్తుంది.
ప్రత్యేక పూజలు
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కొత్తగా పెళ్లయిన దంపతులు ప్రతి సోమవారం గౌరీదేవి అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణం రెండో శుక్రవారం సామూహిక కుంకుమార్చన, మూడో శుక్రవారం మహాలక్ష్మి ఆలయాల్లో లక్ష కుంకుమార్చన, లక్ష్మి సహస్రనామార్చన చేస్తారు.