శ్రావణం పూజలకు ప్రత్యేక మాసం. సాక్షాత్తు విష్ణుమూర్తి జన్మ నక్షత్రం. ఈ నెల రోజుల్లో ప్రతిరోజూ ప్రత్యేకమే. ముఖ్యంగా మహిళలు తమ సౌభాగ్యం కోసం దేవతామూర్తులను ఆరాధిస్తూ పూజలు, వ్రతాలు ఆచరిస్తారు.
– చామ కృష్ణవేణి, భారత్ టాకిస్ రోడ్, కరీంనగర్
మంగళదాయకం
శ్రావణ మాసం మంగళదాయకమైన మాసం. ప్రతి మహిళ ఈ నెల రోజులు నిష్టతతో పూజల్లో పాల్గొంటుంది. తమ జీవితాల్లో మంచి జరగాలని, అమ్మవారిని వేడుకుంటు పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు.
– తొడుపునూరి సౌమ్య, జ్యోతినగర్, కరీంనగర్
శివుడికి ప్రీతిపాత్రం
శ్రావణం విష్ణుమూర్తి జన్మనక్షత్రం. సాక్షాత్తు శివుడు కూడా విష్ణుమూర్తిని పూజించడం ఈ మాసం ప్రత్యేకత. శ్రావణ నక్షత్రానికి ఆధిపతి అయిన శివుడికి శ్రావణ సోమవారాల్లో పూజలు చేయడంతో ఆయన కృపకటాక్షాలు లభిస్తాయి.
– వేములవాడ కమల, రాఘవేంద్రనగర్