కరీంనగర్‌క్రైం: నగరంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలోని మెడికల్ షాపులో ఈనెల 16న జరిగిన చోరీ కేసులో ముగ్గురు నిందితులను త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. త్రీటౌన్ సీఐ జాన్‌రెడ్డి వివరాల ప్రకారం.. హౌసింగ్‌బోర్డుకాలనీలో గౌతం మెడికల్ షాపులో ఈనెల 16న చోరీ జరగగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలనీలో అద్దెకుంటున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సబ్బీర్ ఆలం అలియాస్ అజ్మల్ హుస్సేన్ అలియాస్ సకీర్, గతంలో సిద్దిపేటలో ఓ హోటల్‌లో పని చేసినప్పుడు ఇతడికి పరిచయమైన బీహార్ రాష్ట్రానికి చెందిన రిజ్వాన్ ఆలం, మహమ్మద్ ఫర్హాన్ ఆలం కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనం చేసిన సమయంలో రూ.3వేలు, ఒక సెల్‌ఫోన్ షాపులో ఉండగా.. వాటిని ఎత్తుకెళ్లారు. గతంలో కూడా రాత్రిపూట జరిగిన దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురుని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై బి.జగదీశ్వర్, క్రైమ్ పార్టీ కానిస్టేబుళ్లు సాయినేత్ర, ప్రశాంత్‌ను సీఐ అభినందించారు.
అత్యాచారయత్నం కేసులో
నిందితుడి రిమాండ్
తిమ్మాపూర్: అల్గునూరు శివారులో ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ పక్కన శుక్రవారం మైనర్‌పై అత్యాచారయత్నం కేసులో నిందితుడిని ఎల్‌ఎండీ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. బోయిన్‌పల్లికి చెందిన విలాసాగర్ గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ అనే నిందితుడిపై బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉందని ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.