
డ్రగ్స్‌పై దృష్టి పెట్టండి
● పోలీసులను ఆదేశించిన మంత్రి శ్రీధర్‌బాబు
తిమ్మాపూర్: జిల్లాలో డ్రగ్స్‌పై దృష్టి పెట్టాలని పోలీసులను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ఎల్‌ఎండీ ఎస్సారెస్పీ గెస్ట్ హౌస్‌లో మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆదివారం పలు విషయాలపై మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ.. తిమ్మాపూర్ మండలంలోని విద్యాసంస్థలపై ఫిర్యాదులు వస్తున్నాయని ఏసీపీ వెంకటస్వామి, తిమ్మాపూర్ సీఐ సదన్‌కుమార్‌తో అన్నారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటే కాలేజీలు బాధ్యత వహించాలని, యాజమాన్యాలు బాధ్యులని అన్నారు. డ్రగ్స్ తీసుకున్నవారిని గుర్తించేందుకు ప్రత్యేక కిట్లు వచ్చాయని, యువకులకు పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. నాయకులు అబ్దుల్ సమద్, నారోజు రాకేశ్, కాళ్ల రవి, బోయిని ప్రశాంత్, సురేందర్ తదితరులున్నారు.