
గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా
● ఎన్‌పీడీసీఎల్ డీఈ రాజిరెడ్డి
జగిత్యాలరూరల్: గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమున్న చోట సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు సబ్‌స్టేషన్ల కెపాసిటీ పెంచుతున్నామని ఎన్‌పీడీసీఎల్ జగిత్యాల డీఈ అన్నాడి రాజిరెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలోని 33/11 కేవీ విద్యుత్‌సబ్‌స్టేషన్‌లో కొత్త విద్యుత్ ఫీడర్‌ను ప్రారంభించారు. ప్రజలందరికీ నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వివరించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ స్తంభాలు కొత్తవి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడీఈ జవహార్ లాల్ నాయక్, ఏఈ సుందర్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసుల
ఆత్మీయ సమ్మేళనం
జగిత్యాలరూరల్: జిల్లాలో 1989 పోలీస్ కానిస్టేబుల్ బ్యాచ్‌కు చెందిన పోలీసులు వివిధ హోదాల్లో పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఇదే బ్యాచ్‌కు చెందిన వివిధ ఘటనల్లో అమరులైన పోలీసులకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో జగిత్యాల స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై రాజేశుని శ్రీనివాస్, ఎస్‌బీ హెడ్ కానిస్టేబుల్ బోయిన శ్రీనివాస్, జగిత్యాల ఇంటిలిజెన్స్ నియోజకవర్గ ఇన్‌చార్జి వావిలాల గంగాధర్ పాల్గొన్నారు.

గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా