
రాజ్యాంగాన్ని మార్చే కుట్రను అడ్డుకోవాలి
● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాలటౌన్: రాజ్యాంగాన్ని మార్చే కుట్రను అడ్డుకోవాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రతి ఆదివారం అంబేడ్కర్ స్మరణలో భాగంగా ప్రభుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అధ్యక్షుడు నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఈశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలోగల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాజ్యాంగం గురించి ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు రాజ్యాంగంతోనే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఓరుగంటి రమణారావు, బొల్లం రమేశ్, అనంతుల కాంతారావు, మద్దెల నారాయణ, బుర్ర ప్రవీణ్, జవ్వాజి శంకర్‌తో పాటు అంబేడ్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.