
దాశరథి తెలంగాణ ఆస్తి
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్‌కల్చరల్: తెలంగాణ అంత ఎత్తుకు ఎదిగిన కవి దాశరథి అని, ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదని, తెలంగాణ రాష్ట్రానికి అసలు సిసలైన సాహిత్య ఆస్తి దాశరథి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రచయితల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఫిలిం భవన్‌లో జరిగిన దాశరథి శత జయంతి వేడుకలకు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా దాశరథిని విస్మరించిందని, దాశరథి శత జయంతిని ప్రభుత్వపరంగా సంవత్సరంతా నిర్వహిస్తూ ఉత్సవాలు చేయాలని, దాశరథి పురస్కారాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. దాశరథి శత జయంతి సదస్సును ఘనంగా నిర్వహిస్తున్న సంస్థ అధ్యక్షుడు కొత్త అనిల్‌కుమార్, అతడి కార్యవర్గాన్ని అభినందించారు. దాశరథి జీవితం, సాహిత్యంపై డాక్టర్ గన్నమరాజు గిరిజామనోహర్‌బాబు, దాశరథి సినిమా సాహిత్యంపై నిజాం కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరునగరి శరత్‌చంద్ర ఉపన్యాసాలు చేశారు. కవులను గంగుల కమలాకర్ సన్మానించారు. కవులు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, గజేందర్‌రెడ్డి, డి.రాజారామ్మోహన్, గాజుల రవీందర్, శంకర్‌ప్రసాద్, కాండూరి వెంకటేశ్వర్లు, నీలగిరి అనిత, చిందం సునీత, బొమ్మకంటి కిషన్ తదితరులున్నారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
కోనరావుపేట: నిమ్మపల్లిలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. గ్రామానికి చెందిన అనుముల లచ్చిరెడ్డి–లచ్చవ్వ కుమారుడు మహేందర్(33) ఆదివారం సాయంత్రం తన వ్యవసాయ క్షేత్రం వద్ద యంత్రంతో గడ్డి కోస్తున్నాడు. అదే ప్రాంతంలో విద్యుత్ స్తంభం నుంచి మోటారు వరకు వెళ్లే తీగ ఉంది. గడ్డిని కోస్తుండగా తీగ తెగి యంత్రానికి విద్యుత్ ప్రసారమైంది. విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య మమత, కుమారుడు, కూతురున్నారు.
యువకుడి బలవన్మరణం
కొడిమ్యాల: పెళ్లి కావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సందీప్ కథనం ప్రకారం.. పూడూర్ గ్రామనికి చెందిన చిలువేరు అశోక్(36) కొంతకాలంగా వివాహం కావడం లేదని తీవ్ర నిరాశకు లోనై ఈనెల 11న గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి తండ్రి నరసింహరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
జగిత్యాలక్రైం: పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో జయశంకర్ విగ్రహం చౌరస్తా వద్ద ఆదివారం సాయంత్రం సైకిలిస్టును క్రేన్ ఢీకొనగా.. పోచంపల్లి రాజయ్య(55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామానికి చెందిన రాజయ్య జగిత్యాలలోని భవానినగర్‌లో నివాసముంటున్నాడు. ఆదివారం సాయంత్రం పని నిమిత్తం సైకిల్‌పై వస్తుండగా.. క్రేన్ డ్రైవర్ అజాగ్రత్తగా, అతివేగంగా వచ్చి రాజయ్యను ఢీకొట్టాడు. రాజయ్య తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
లాండ్రీ షాప్ దగ్ధం
రుద్రంగి: మండల కేంద్రంలో విద్యుదాఘాతంతో లాండ్రీ షాప్ దగ్ధమైంది. మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి నారాయణ లాండ్రీ దుకాణంలోని బట్టలు, సామగ్రి కాలి బూడిదయ్యాయి. కొన్ని సంవత్సరాలుగా లాండ్రీ షాప్ నడిపిస్తూ జీవనోపాధి పొందుతున్నానని, ప్రస్తుతం జీవనోపాధి లేకుండా పోయిందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ అంతరాయం ఏర్పడి విద్యుత్ రావడంతో మంటలు చెలరేగి ఇసీ్త్ర పెట్టె, కస్టమర్లు ఇచ్చిన బట్టలు కాలిపోయాయని రోదించాడు.
● రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
● డబ్బులు పోగొట్టుకుంటున్న జనం
● బయటకు చెప్పలేక సతమతం

దాశరథి తెలంగాణ ఆస్తి

దాశరథి తెలంగాణ ఆస్తి

దాశరథి తెలంగాణ ఆస్తి

దాశరథి తెలంగాణ ఆస్తి

దాశరథి తెలంగాణ ఆస్తి