
అప్రమత్తంగా ఉంటేనే భద్రం
ఆన్‌లైన్ ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మొద్దు. ఇన్‌స్టాగ్రాం ద్వారా ఇటీవల కాలంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. అందులో లింకులను పంపి ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెట్టుబడి పెడితే లాభాలు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచుతున్నారు. మ్యాట్రిమోని పేరుతో అమ్మాయిలు పరిచయం చేసుకొని షేర్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ పేరుతో తప్పుడు సైట్లు సృష్టించి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ఈ విషయంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి.
– డి.వెంకటరంగారెడ్డి, ఏసీపీ, సైబర్ క్రైం, రామగుండం