
తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు
● ఆడబిడ్డను అగౌరవిస్తే ఊరుకోం ● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావవసంత
జగిత్యాలరూరల్: ఆడబిడ్డలను అగౌరవపరిస్తే ఊరుకునేది లేదని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడబిడ్డను అవమానించడం సరికాదన్నారు. బీసీల కోసం పోరాటం చేస్తున్న కవితపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కవిత పోరాటాన్ని బీసీలు స్వాగతిస్తుంటే తీన్మార్ మల్లన్న చీము, నెత్తురు లేనట్లు మాట్లాడడం సరికాదని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు మారంపెల్లి రాణి, సాయి ఉదయ, బీఆర్‌ఎస్ నాయకులు అనురాధ, లక్ష్మి, రజియా, నజియా, భాగ్యలక్ష్మి, సునీత పాల్గొన్నారు.