
రూ.18.71 కోట్ల సీఎంఆర్ మాయం
సుల్తానాబాద్‌రూరల్/సుల్తానాబాద్: రైతుల వద్ద కొనుగోలు చేసి సీఎంఆర్(మర ఆడించేందుకు)కు కేటాయించిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న రైస్‌మిల్లుల పన్నాగాన్ని సివిల్ సప్లయ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు బట్టబయలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని సాయి మహాలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ రైస్‌మిల్లుల యజమానులు తమకు కేటాయించిన ధాన్యాన్ని 5 లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ ప్రభాకర్‌సాదేశాల మేరకు అధికారులు గురువారం పట్టుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీనాథ్ రైస్‌మిల్లుల్లోని ధాన్యం ప రిశీలించి విచారణ చేపట్టారు. ఆయన మా ట్లాడుతూ, రెండు రైస్‌మిల్లులకు 2023–2024 సంవత్సరంలో యాసంగి ధాన్యం సీఎంఆర్ కోసం కేటాయించగా సాయి మహాలక్ష్మీ మిల్లులో 61, 65,305 క్వింటాళ్లు, సౌభాగ్యలక్ష్మీ మిల్లులో 10,800 క్వింటాళ్ల ధాన్యంలో వ్యత్యాసం వచ్చిందన్నారు. దీని విలువ(ఎకానమిక్ కాస్ట్) ప్రకారం సుమారు రూ.18.71కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రభు త్వం కేటాయించిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న యజమాని మారుతిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. లారీల్లో ధాన్యం ఎక్కడికి తరలించారనే దానిపైనా లోతుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్‌వో తెలిపారు.
ధాన్యం తరలిస్తున్న ఐదు లారీలను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది
విచారణ చేపట్టిన జిల్లా సివిల్ సప్లయ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు