ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు | - | Sakshi
Sakshi News home page

ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు

Jul 13 2025 7:35 AM | Updated on Jul 13 2025 7:35 AM

ఎంపీప

ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు

కొత్తగా

రెండు

జగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధికారులు ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పునర్విభజన పూర్తి చేశారు. జిల్లా ఏర్పడినప్పుడు 18 మండలాలు ఉండగా.. తాజాగా భీమారం, ఎండపల్లి మండలాలు ఆవిర్భవించారు. ఈ రెండు చోట్ల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలు ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేశారు. కొత్తగా ఏర్పడిన ఎండపల్లి మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నప్పటికీ అదనంగా ఒకటి కొత్తగా కలిపారు. అలాగే జగిత్యాల అర్బన్‌లో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఉండగా అదనంగా మరొకటి ఏర్పాటు చేశారు. గతంలో జిల్లావ్యాప్తంగా 214 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 216కు చేరాయి. తాజాగా 216 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

పెరిగిన జెడ్పీటీసీ స్థానాలు

జిల్లాలో గతంలో 18 జెడ్పీటీసీ స్థానాలు మాత్రమే ఉండేవి. కొత్తగా భీమారం, ఎండపల్లి మండలాలు ఏర్పడడంతో 20 మండలాలు అయ్యాయి. ఈ క్రమంలో అక్కడ కూడా జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ లెక్కన జిల్లాలో 20 జెడ్పీటీసీలు, 20 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సూచనప్రాయంగా తెలియజేయడంతో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఎంపీటీసీల పునర్విభజన షెడ్యూల్‌ ప్రకటించడంతో జిల్లాలో ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలే జరుగుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో బూత్‌లెవల్‌ అధికారులకు ఎస్‌కేఎన్‌ఆర్‌ కళాశాలలో శిక్షణ ఇచ్చారు. బీఎల్వోల యాప్‌ ద్వారా ఓటర్ల నమోదు చేపట్టారు. అధికారులు పోలింగ్‌ బూత్‌ల పరిశీలన చేసి అన్ని ఏర్పాట్లు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

ఎన్నికల వేడి

స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా.. ఎన్నికల నిర్వహించకపోవడంతో నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగనున్నాయి. జెడ్పీటీసీలు అందరు కలిసి జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకోనుండగా.. ఎంపీటీసీలందరూ కలిసి ఎంపీపీని ఎన్నుకుంటారు. ప్రభుత్వం త్వరలోనే రిజర్వేషన్లు ఖరారు చేయనున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది.

మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలు

బీర్‌పూర్‌ : 6

భీమారం : 6

బుగ్గారం : 6

ధర్మపురి : 13

ఎండపల్లి : 8

గొల్లపల్లి : 13

ఇబ్రహీంపట్నం : 12

జగిత్యాల రూరల్‌ : 16

జగిత్యాల : 5

కథలాపూర్‌ : 13

కొడిమ్యాల : 12

కోరుట్ల : 12

మల్లాపూర్‌ : 15

మల్యాల : 14

మేడిపల్లి : 9

మెట్‌పల్లి : 14

పెగడపల్లి : 13

రాయికల్‌ : 14

సారంగాపూర్‌ : 7

వెల్గటూర్‌ : 8

ఎంపీటీసీ స్థానాల పునర్విభజన

తుది జాబితా విడుదల

జిల్లాలో మొదలైన ఎన్నికల వేడి

జిల్లాలో గ్రామపంచాయతీలు : 385

31–01–2025 ప్రకారం ఓటర్లు : 6,02,236

జెడ్పీటీసీ స్థానాలు : 20

ఎంపీపీ స్థానాలు

: 20

ప్రక్రియ చేపట్టాం

జిల్లాలో గతంలోనే ప్రక్రియ పూర్తయినప్పటికీ నూతనంగా మరో రెండు ఎంపీటీసీలు, కొత్త మండలాలు కావడంతో రెండు జెడ్పీటీసీలు ఏర్పడ్డాయి. అక్కడ మండలాల వారీగానే ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ కల్పించాం.

– గౌతమ్‌రెడ్డి, జెడ్పీ సీఈవో

ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు1
1/1

ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement