
మట్టిలో కలిసిపోకుండా..
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన తుమ్మ రామకృష్ణ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా అతడి కిడ్నీలు, కాలేయం దానం చేశారు. మృతుడి భార్య నిర్మల, కూతురు ప్రవళిక, కుమారుడు పృథ్వీరాజ్, కుటుంబసభ్యుల సమక్షంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దానం చేశారు. ఓదెల గ్రామానికి చెందిన అయిలు మల్లేశ్ ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందగా, అతడి కళ్లను భార్య రాధిక, కుటుంబసభ్యులు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దానం చేశారు. అలాగే ఓదెల మండలం అబ్బిడిపల్లె గ్రామస్తులంతా అవయవదానానికి ముందుకొచ్చి జిల్లా కలెక్టర్‌కు అంగీకారపత్రం అందజేశారు.

మట్టిలో కలిసిపోకుండా..

మట్టిలో కలిసిపోకుండా..