
తండ్రి స్ఫూర్తితో..
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగుండం కా ర్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీకి చెందిన దాసారపు మో హన్ గత డిసెంబర్‌లో అనా రోగ్యంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు అతడి నే త్రాలు, దేహాన్ని ‘సిమ్స్’కు దానం చేశారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభలో బాధిత కుటుంబానికి అభినందన పత్రం అందజేశారు. ఈసందర్భంగా మోహన్ చిన్న కూతురు అశ్విని తన మరణానంతరం దేహదానం చేసేందుకు అంగీకారం తెలుపగా, పలువురు ఆమెను అభినందించారు. ఈసందర్భంగా అశ్విని మాట్లాడుతూ, తన తండ్రి చెప్పిన విధంగా మనిషి మరణించిన తర్వాత అవయవాలు మట్టిలో కలిసిపోకుండా పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో దేహదానం చేసేందుకు ముందుకొచ్చానని పేర్కొన్నారు.

తండ్రి స్ఫూర్తితో..