
అడుగంటిన వరదకాలువ
కథలాపూర్: ఎస్సారెస్పీ వరదకాలువలో నీరు అడుగంటడంతో మండలంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా మాదిరిగానే వర్షాలు కురుస్తాయని భావించిన రైతులు నార్లు పోసుకున్నారు. రైతులు వరదకాలువ నీటితో పొలాన్ని సిద్ధం చేశారు. వర్షాలు కురవకపోవడంతో వరదకాలువలో నీరు అడుగంటింది. దీంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా వరదకాలువకు నీరు వదిలితేనే తాము వరి నాట్లు వేసే అవకాశం ఉందని, లేకుంటే నార్లు ముదిరిపోయే ప్రమాదముందని అంటున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ చూపి వరదకాలువలోకి నీరు వదలాలని కోరుతున్నారు.
వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్
జగిత్యాల: సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్‌తో చెక్ పెట్టవచ్చని ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్ అన్నారు. శనివారం ఐఎంఏ హాల్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకూ క్యాన్సర్ మరణాలు పెరిగిపోతున్నాయని, సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, గైనకాలజీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీలత, కోశాధికారి సుధీర్‌కుమార్, ఒడ్నాల రజిత, పద్మరాథోడ్ పాల్గొన్నారు.
సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరి
కోరుట్ల: సీపీఆర్‌పై ప్రథమ చికిత్స నిర్వహించే ఆర్‌ఎంపీ, పీఎంపీలకు అవగాహన తప్పనిసరిగా ఉండాలని ఐఎంఏ సెంట్రల్ కమిటీ సభ్యుడు వై.అనూప్ రావు అన్నారు. పట్టణంలోని ఓ ఆసుపత్రిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్‌ఎంపీ, పీఎంపీలకు సీపీఆర్‌పై శిక్షణ నిర్వహించారు. ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయని, సీపీఆర్ విధానం ద్వారా గుండెకు రక్తప్రసరణ అందించి ప్రాణాలను రక్షించవచ్చని పేర్కొన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండే ఆర్‌ఎంపీ, పీఎంపీలు తమ పరిధికి మించి వైద్యం చేయరాదని అన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ కోరుట్ల అధ్యక్షుడు రేగొండ రాజేష్, కార్యదర్శి జగదీశ్వర్, అన్వేశ్, సమీర్, ఆర్‌ఎంపీ, పీఎంపీ అధ్యక్షుడు సందా శ్రీపతి, సిద్దిక్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

అడుగంటిన వరదకాలువ

అడుగంటిన వరదకాలువ