
ఆరుదశాబ్దాల ఎస్‌కేఎన్‌ఆర్
● ఎందరో ప్రముఖులు చదువుకున్న కళాశాల
జగిత్యాల: ఒకప్పుడు జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్ కాలేజీలో సీటు దొరకాలంటే ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే లెటర్ ఉండాల్సిందే. 1965లో ఏర్పాటైన ఈ కాలేజీ 60వ వసంతంలోకి అడుగిడింది. జ గిత్యాలకు చెందిన ప్రముఖుడు కాసుగంటి లక్ష్మీనా రాయణరావు ధర్మపురి రోడ్‌లో 32.07 ఎకరాల స్థలాన్ని కొని ప్రభుత్వ కళాశాలకు విరాళంగా ఇచ్చారు.
అన్ని కోర్సులు..
సువిశాలమైన ప్రాంతంలో ఉన్న ఈ కళాశాలలో విద్యార్థులకు అన్ని కోర్సులు ఉన్నాయి. బీఏ, బీఎం, బీఎస్సీ, బీకాం, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లిష్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏతో పాటు, జిల్లాలో హెల్ప్‌లైన్ ఇంజనీరింగ్, పాలిసెట్ హెల్ప్‌లైన్ సెంటర్ కూడా ఉంది. నిరుద్యోగ అభ్యర్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ సైతం ఏర్పాటు చేశారు. 26 మంది లెక్చరర్స్ బోధన చేస్తున్నారు.
డిజిటల్ లైబ్రరీ
ఎస్‌కేఎన్‌ఆర్ కాలేజీలో ప్రస్తుతం 605 మంది చదువుకుంటున్నారు. ఇందులోని డిజిటల్ లైబ్రరీ విద్యార్థులకు ఎంతో ఉపయోకరంగా ఉంది. దీనిలో పురాతన, ప్రస్తుత హైటెక్ యుగానికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. ఇటీవలే ఈ కళాశాలకు న్యాక్ బీ గ్రేడ్ లభించింది. అలాగే అన్ని వసతులతో కూడిన జిమ్ సైతం ఏర్పాటు చేశారు. 32 ఎకరాల్లో రకరకాల చెట్లతో గ్రీనరి ఏర్పాటు చేయగా, గతంలో రూ.5 లక్షల అవార్డు సైతం ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే రూ.50 లక్షలతో వాకింగ్‌ట్రాక్, కళాశాల ఎదుట ఓపెన్‌జిమ్ ఏర్పాటు చేశారు.
వేడుకలకు సన్నాహాలు
కళాశాల ఏర్పడి 60 ఏళ్లు పూర్తి కావడంతో వేడుకలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ రమణతో పాటు చాలా మంది ప్రముఖులు ఈ కాలేజీలోనే చదువుకున్నారు. వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
హాస్టల్ వసతి ఉంటే..
32 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కళాశాలలో అటాచ్డ్ హాస్టల్ ఉంటే ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగేది. ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్ వసతి ఏర్పాటు చేస్తే కార్పొరేట్ కళాశాలల కన్నా బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
జగిత్యాల: జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాల 60 ఏళ్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. శుక్రవారం కళాశాలను సందర్శించి మాట్లాడారు. పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ప్రిన్సి పాల్ అశోక్ మాట్లాడుతూ, కళాశాలలో హాస్టల్ వసతి, ఆడిటోరియం భవనం, నూతన పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, రాజు, సాయిమధుకర్, గోవర్ధన్, సురేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఆరుదశాబ్దాల ఎస్‌కేఎన్‌ఆర్