‘ఇందిరమ్మ ఇళ్ల’కు రూ.లక్ష రుణం | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ ఇళ్ల’కు రూ.లక్ష రుణం

Jul 1 2025 4:18 AM | Updated on Jul 1 2025 4:18 AM

‘ఇందిరమ్మ ఇళ్ల’కు రూ.లక్ష రుణం

‘ఇందిరమ్మ ఇళ్ల’కు రూ.లక్ష రుణం

సారంగాపూర్‌: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేవారికి సెర్ప్‌ ద్వారా రూ.లక్ష రుణం అందించనున్నట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ తెలిపారు. మండలకేంద్రంలో సీఎంఆర్‌ఎఫ్‌ రూ.12.48 లక్షలు, కల్యాణలక్ష్మి రూ.31లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణం ఆర్థిక కారణాలతో జాప్యం జరగొద్దన్న ఉద్దేశంతో మహిళా సంఘాల నుంచి రుణం అందిస్తామని, దీనిపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పెంబట్ల బీరయ్య ఆలయ నిర్మాణానికి సీజీఎఫ్‌ కింద రూ.12 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. తహసీల్దార్‌ ఎండి.వాహీదొద్దీన్‌, ఎంపీడీవో గంగాధర్‌, ఆర్‌ఐ వెంకటేశ్‌, ఎంపీవో సలీం పాల్గొన్నారు.

జగన్నాథపూర్‌ బ్రిడ్జి కోసం కృషి

రాయికల్‌: రాయికల్‌ మండలం బోర్నపల్లి–జగన్నాథపూర్‌ గ్రామాల మధ్య బ్రిడ్జి కోసం సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రులను కలిశానని ఎమ్మెల్యే అన్నారు. బ్రిడ్జి మంజూరు కావడంపై జగన్నాథపూర్‌, బోర్నపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిశారు. రూ.4 కోట్లతో జగన్నాథపూర్‌లో చెక్‌డ్యాం నిర్మాణంతో వందలాది ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. గిరిజన, ఆదివాసుల నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. సింగిల్‌ విండో చైర్మన్‌ ఏనుగు మల్లారెడ్డి, నాయకులు కోల శ్రీనివాస్‌, పాదం రాజు, కవిత, శ్రీనివాస్‌, గంగారాం, శంకర్‌, తులసి, అనిల్‌, నారాయణ, కాటిపల్లి గంగారెడ్డి, మర్రిపల్లి శ్రీనివాస్‌, గన్నె రాజిరెడ్డి, చంద్రశేఖర్‌, అనుపురం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 20 మందికి సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని సూచించారు. 35వ వార్డులో సీసీరోడ్లకు భూమిపూజ చేశారు. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలన్నారు. గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్‌, లక్ష్మణ్‌, బాలె శంకర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన పాత డీఎంహెచ్‌వో డాక్టర్‌ సమీయోద్దీన్‌, ధర్మపురి నీటిపారుదల శాఖ ఈఈ నారాయణరెడ్డిని సత్కరించారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌, చక్రునాయక్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌, జైపాల్‌, రాంచందర్‌రావు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement