
నిరుపేద బాలుడి వైద్యానికి రూ.1.13లక్షల సాయం
ధర్మపరి: కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో కొ ట్టుమిట్టాడుతున్న ఓ నిరుపేద బాలుడి వైద్యం కోసం ఫేస్‌బుక్ మిత్రులు రూ.1.13లక్షలు వి రాళాలుగా అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన మద్దిరాల మనోహర్, సరిత దంపతులకు కుమారుడు, కూతురు సంతానం. మనోహర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఆర్నెళ్ల క్రితం కుమారుడు రిత్విక్ క్యాన్స ర్ బారిన పడడంతో వైద్యం చేయించేందుకు ఆర్థికంగా ఇ బ్బంది పడుతున్నా డు. అక్కడి సామాజిక మిత్రుల ద్వారా తెలుసుకున్న ధర్మపురికి చెంది న సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ బాలుడి వైద్య ఖర్చులకు సాయం అందించాలని జూన్ 5న ఫేస్‌బుక్‌లో పోస్టు చేశా డు. బాలుడి తల్లి బ్యాంకు ఖాతా ను అందులో పొందుపర్చాడు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల కు చెందిన ఎన్నారైలు, దాతలు స్పందించి సరి త బ్యాంకు ఖాతాకు రూ.1.13 లక్షలు విరా ళాలు పంపించారు. ఆ డబ్బులను బ్యాంకు మే నేజర్ చేతులమీదుగా బాధిత కుంటుబానికి పంపిణీ చేశారు. దాతల విరాళాలతో వైద్య సేవలు కొనసాగుతున్నట్లు రమేశ్ తెలిపారు.