
● యువత చేతిలోనే దేశ భవిత ● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల
కోరుట్ల: కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్‌మేళా విజయవంతమైంది. మేళాకు 1756 మంది హాజరుకాగా.. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు 556 మంది ఎంపికయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఏటా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్, కరీంనగర్ వంటి నగరాల్లోని కంపెనీలకు ఎంపికై తే దూరం ఎక్కువని నిరాశకు గురికావొద్దని, వారికి కావాల్సిన ఏర్పాట్లను కంపెనీలతో మాట్లాడి తానే ఏర్పాటు చేయిస్తామని వెల్లడించారు. యువత చదువుతో పాటు జాబ్ స్కిల్స్ కలిగి ఉండాలన్నారు. మేళాలో 75కంపెనీల ప్రతినిధులు స్టాల్స్ ఏర్పాటు చేసి కేటగిరీల వారీగా ఐటీ, ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో అవకాశాలు కల్పించాయి. బీఆర్‌ఎస్ నాయకులు దారిశెట్టి రాజేశం, చీటి వెంకట్రావ్, తోట నారాయణ, కేతిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సాయిరెడ్డి, అతిక్, వినోద్, సురేందర్, అన్వర్, అంజయ్యలు వివిధ కంపెనీలు ప్రతినిధులు పాల్గొన్నారు.

● యువత చేతిలోనే దేశ భవిత ● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల