
డ్రైనేజీల్లో పూడికతీత
జగిత్యాల: చెత్తాచెదారం పేరుకుపోయిన డ్రైనేజీలను బల్దియా సిబ్బంది శుభ్రం చేయించారు. బల్దియా పరిధిలో డ్రైనేజీలు పేరుకుపోవడంతో ‘పారిశుధ్యం అస్తవ్యస్తం’ శీర్షికన ‘సాక్షి’ బుధవారం కథనం ప్రచురించిన విషయం తెల్సిందే. ఈ కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు జిల్లాకేంద్రంలోని గొల్లపల్లి రోడ్‌లోగల శ్మశాన వాటిక సమీపంలోని డ్రైనేజీలో పూడికను జేసీబీ సహాయంతో తొలగించారు. నర్సింగాపూర్ కాలనీలోగల డ్రైనేజీల్లోని చెత్తాచెదారాన్ని మున్సిపల్ కార్మికులు తొలగించారు. సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరిస్తామని కమిషనర్ స్పందన అన్నారు.

డ్రైనేజీల్లో పూడికతీత

డ్రైనేజీల్లో పూడికతీత