
కూచిపూడిలో చిన్నారుల ప్రతిభ
జగిత్యాలటౌన్: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో నిర్వహించిన జాతీయస్థాయి కూచిపూడి పోటీల్లో జగిత్యాలకు చెందిన మహాదేవుని నిత్యశ్రీ, శ్రేయాంషి, విశ్వద, శ్రీనిధి, శ్రీకృతి ప్రతిభచాటారు. నిత్యశ్రీ, శ్రేయాంషి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి బహుమతులు గెలుచుకున్నారు. ఈసందర్భంగా చిన్నారులను మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, జగిత్యాల మేదిని కళానిలయం నిర్వాహకులు, నాట్య సామ్రాట్ బొమ్మిడి నరేశ్ అభినందించారు. భవిష్యత్తులో చిన్నారులు నాట్యమయూరాలుగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.