
జిల్లావ్యాప్తంగా కంపించిన భూమి
జగిత్యాలక్రైం/కోరుట్ల/ధర్మపురి/మల్యాల/మెట్‌పల్లి/మల్లాపూర్/మేడిపల్లి: జిల్లావ్యాప్తంగా ఆదివారం సాయంత్రం భూమి కంపించింది. సుమారు 6.50 గంటలకు రెండుమూడు సెకన్ల పాటు కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముందుగా పెద్ద శబ్దం రావడంతో ఏం జరిగిందో తెలియక కంగారు పడిన జనం.. భూమి కంపించిన ఆనవాళ్లు తెలుసుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని బల్లలు, పైఅంతస్తుల్లో ఉన్న రేకుల గదులు, షెడ్లు, సామగ్రి కదిలినట్లు ప్రజలు తెలిపారు. ధర్మపురిలో రెండుసార్లు స్వల్పంగా కంపించిందని ప్రజలు తెలిపారు. మల్యాలలో భారీ శబ్దం రావడంతో ఇళ్లలోని వస్తువులు కదిలాయని, ముందుగా ఉరుములు అనుకున్నామని ప్రజలు తెలిపారు. జగిత్యాల రూరల్, అర్బన్ మండలాల్లో ఆరు సెకన్లపాటు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు. మళ్లీ భూకంపం వస్తుందోననే అనుమానంతో ప్రజలంతా ఆరుబయటే ఉన్నారు. మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నంలోనూ భూమి కంపించింది.
భీమారంలో కూలిన ఇల్లు
భీమారం మండల కేంద్రంలో పల్లె అర్జున్‌కు చెందిన ఇంటి పైకప్పు కూలి పోయింది. పెద్ద శబ్బంతో కంపించడంతో ఇంటి పైకప్పు కూలిందని, దీంతో భయంతో బయటకు పరుగులు తీశామని అర్జున్ తెలిపారు.
జిల్లాకేంద్రంలో కంపించిన భూమి
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్, విద్యానగర్, కృష్ణానగర్‌లో భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు కిందపడటంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఫర్నిచర్ వస్తువులు కదలడంతో ఉలిక్కిపడ్డారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది భయంతో పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రతగా నమోదైనట్లు తెలిసింది.
రాయికల్‌లో..
రాయికల్: పట్టణంతోపాటు మండలంలోని 32 గ్రా మాల్లో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లోంచి బయటకువచ్చారు.
భయంతో బయటకు పరుగులు తీసిన జనం
భీమారం మండలంలో కూలిన ఇంటి పైకప్పు

జిల్లావ్యాప్తంగా కంపించిన భూమి

జిల్లావ్యాప్తంగా కంపించిన భూమి