జగిత్యాల/మెట్‌పల్లి/రాయికల్ : బల్దియాల్లో స కాలంలో పన్ను చెల్లించకుంటే బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ఆదివారం రాయికల్ బల్ది యాలో ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపు, వివిధ రకాల పన్ను వసూళ్లను పర్యవేక్షించారు. ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో బల్దియాలో వందశాతం ఇంటి పన్ను వసూలు చేయాలన్నారు. ఇంటి పన్ను చెల్లించని వారితో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. పన్ను చెల్లించాలని సూచించారు. చెల్లించని వారికి రెడ్‌నోటీసు జారీ చేయాలని, అప్పుడు కూడా పన్ను చెల్లించకపోతే నల్లా, కరెంట్ కనెక్షన్లు నిలిపివేయాలని ము న్సిపల్ అ ధికారులను ఆదేశించారు. ఆయన వెంట కమిషనర్ మనోహర్‌గౌడ్, మేనేజర్ వెంకటి ఉన్నారు.
పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి
పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాల ని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాకేంద్రంలో ని వార్డు అధికారులు లక్ష్యాలను నిర్దేశించాలని, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు, ఇంటి పన్ను బకాయిదారులకు ఫోన్‌చేసి పన్ను చెల్లించేలా చూడాలన్నారు. ఆయన వెంట కమిషనర్ స్పందన, రెవెన్యూ అధికారులు ఉన్నారు. మెట్‌పల్లిలో ఇంటిపన్ను వసూళ్లు, ఎల్‌ఆర్‌ఎస్ అమలు తీరును పరిశీలించారు. ఆయన వెంట కమిషనర్ మోహన్ ఉన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్