బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌ | - | Sakshi
Sakshi News home page

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌

Mar 23 2025 9:03 AM | Updated on Mar 23 2025 9:01 AM

జగిత్యాల: ప్లాస్టిక్‌ వాడొద్దని, బాటిళ్లు యూజ్‌ చేయవద్దని ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు ఇచ్చినా.. హెచ్చరించినా.. ప్రజలు మాత్రం ప్లాస్టిక్‌ వాడటం మానడం లేదు. ఎక్కువగా వాటర్‌బాటిల్స్‌ కొనుగోలు చేసుకుని వాడుతుంటారు. తినడానికి ఏవైనా కొనుగోలు చేసినా హోటళ్ల నిర్వాహకులు కవర్లలోనే ప్యాకింగ్‌ చేస్తూ ఇస్తుంటారు. వీటిని కొనుగోలు చేసుకుని బాటిళ్లలోని నీటిని తాగుతూ వాటిని ఎక్కడపడితే అక్కడే పడేస్తున్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, ఆస్పత్రులు, పెద్దపెద్ద హోటళ్ల వద్ద ఈ సంఘటనలు చోటుచేసుకుంటాయి. వీటిని నివారించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం అత్యంత వ్యయంతో బాటిల్‌నెట్‌ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని జగిత్యాల మున్సిపాలిటీలో తప్ప వేరే మున్సిపాలిటీల్లో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. బాటిల్‌ ఆకారంలో ఉండే బాటిల్‌నెట్‌లను కొనుగోలు చేసి ప్రధానమైన చోట్ల ఏర్పాటు చేశారు. ఒక బాటిల్‌నెట్‌కు రూ.18 వేలు వెచ్చించారు. జిల్లా కేంద్రంలో సుమారు 15 ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడా ఉపయోగంలో లేవు. దాంట్లో ఎవరూ వేసిన పాపాన పోలేదు. దాదాపు జగిత్యాలలో రూ.2.70 లక్షల ప్రజాధనం వృథాగానే మారిందని చెప్పవచ్చు. వాస్తవానికి వీటిని యూజ్‌ చేస్తే ఎన్నో ఉపయోగాలుంటాయి. అటు స్వచ్ఛ సర్వేక్షణ్‌తోపాటు ఇటు ఎలాంటి ప్రమాదాలూ లేకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్లాస్టిక్‌ కవర్స్‌గానీ, బాటిల్స్‌ గానీ రోడ్లుపై పడేస్తే ప్లాస్టిక్‌ కవర్లు ఆవులు తిని అనారోగ్యానికి గురికాగా.. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ మురికికాలువలో పడేయడంతో వాటితోనే నిండిపోవడంతో మురికినీరు బయటకు వెళ్లక రోడ్డుపైనే ప్రవహిస్తోంది. రోడ్డుపై వాటర్‌బాటిల్స్‌ ఉంటే వాహనదారులు దానిపై వెళ్తే వాహనం పడిపోయి ప్రమాదాలు జరిగిన సంఘటనలున్నాయి.

అవగాహన లేకనే

బాటిల్‌నెట్స్‌ వాటర్‌బాటిల్‌ ఆకారంలోనే ఏర్పాటు చేసి కొన్ని చోట్లలో ఏర్పాటు చేశారు. వీటిపై ఎవరికీ అవగాహన కల్పించకపోవడం, ప్లాస్టిక్‌ వస్తువులు, బాటిల్స్‌ ఇందులోనే వేయాలని తెలపకపోవడంతో ప్రజలు ఇష్టానుసారంగా పడేస్తున్నారు. ముఖ్యంగా పార్క్‌లలో అయితే ఎక్కబడితే అక్కడ ప్లాస్టిక్‌ వస్తువులు పడేస్తున్నారు. అధికారులు స్పందించి బాటిల్‌నెట్‌లలోనే ప్లాస్టిక్‌ బాటిల్స్‌, కవర్లు వేయాలని, లేనిచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించండం.. లేకుంటే జరిమానాలు వేయడం వంటివి చేస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రజాధనం వృథా

కొన్ని మున్సిపాలిటీల్లోనే ఏర్పాటు

డ్రెయినేజీల్లోనే ప్లాస్టిక్‌ చెత్త

బాటిల్‌నెట్‌లు ఏర్పాటు చేయాలి

కోరుట్ల పట్టణంలో బాటిల్‌నెట్స్‌ ఏర్పాటు చేయలేదు. ప్లాస్టిక్‌ బాటిళ్లు రోడ్డుపైనే పడేస్తున్నారు. ప్రధాన కూడళ్లు, వార్డుల్లో రహదారుల వెంట ఏర్పాటు చేయాలి. మురికికాలువలోనే పడేస్తున్నారు. అధికారులు స్పందించాలి.

– విఘ్నేశ్‌, కోరుట్ల

ఉపయోగించుకోవాలి

ధర్మపురిలో బాటిల్‌నెట్‌ పూర్తిస్థాయిలో లేవు. గోదావరి పరిసర ప్రాంతంలో జాలీలు ఏర్పాటు చేసినప్పటికీ అందులో వేయడం లేదు. మున్సిపల్‌ అధికారులు బాటిల్‌నెట్స్‌ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుని అందులో వేసేలా చూడాలి.

–లవన్‌కుమార్‌, ధర్మపురి

ప్రధాన కూడళ్లలో పెట్టాలి

బహిరంగ కూడళ్లలో బాటిల్‌నెట్స్‌ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటాయి. మెట్‌పల్లిలో ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అధికారులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు సైతం వాటిపై అవగాహన కల్పించాలి.

– షరీఫోద్దీన్‌, మెట్‌పల్లి

మురికికాలువలో వేస్తున్నారు

ప్లాస్టిక్‌ బాటిల్స్‌, ఇతరత్రా వస్తువులన్నీ మురికికాలువల్లోనే వేస్తున్నారు. దీంతో డ్రైనేజీలన్నీ నిండిపోయి దుర్గందం వెదజల్లుతోంది. బాటిల్స్‌ రోడ్డుపై పడేయడంతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. మున్సిపల్‌ అధికారులు స్పందించాలి.

– రంజిత్‌, రాయికల్‌

ఇది కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన బాటిల్‌ నెట్‌. ఇది పార్కింగ్‌ ఏరియాలో ఏర్పాటు చేయడంతో యూస్‌ లేకుండా పోయింది. కలెక్టరేట్‌కు నిత్యం వందలాది మంది వస్తుంటారు. ప్రజావాణి రోజు వివిధ సమస్యల ఫిర్యాదుల కోసం వస్తుంటారు. కానీ.. ఇందులో ప్లాస్టిక్‌ బాటిళ్లు వేసిన పాపాన పోలేదు.

ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్‌ వద్దగల ప్రభుత్వ జనరల్‌

ఆస్పత్రి ముందు ఏర్పాటు చేసిన బాటిల్‌ నెట్‌. దీనిని పెట్టి దాదాపు రెండేళ్లు అవుతోంది. అయినా ఏ ఒక్క బాటిల్‌ వేసిన పాపాన పోలేదు. ఏదో నామమాత్రంగా పెట్టినట్లుందే తప్ప దానిని ఎవరూ యూజ్‌ చేయడం లేదు. వాటిపై అవగాహన లేకపోవడం ఒకింత కారణంగా తెలుస్తోంది. ప్రజలు వాటర్‌బాటిళ్లు, ఇతరత్రా ప్లాస్టిక్‌ వస్తువులను రోడ్డుపై లేకుంటే డ్రైనేజీల్లో పడేస్తున్నారు.

ఇది ధర్మపురిలో ప్లాస్టిక్‌ వస్తువులు, ఇతరత్రా వస్తువులు వేసేందుకు వీలుగా చుట్టూ జాలి ఏర్పాటు చేశారు. ఇందులో ఎవరూ వేసిన పాపాన పోలేదు. గోదావరిలోనే ప్లాస్టిక్‌ బాటిల్స్‌ విచ్చలవిడిగా పడేస్తున్నారు. దీంతో పుణ్యక్షేత్రం కావడంతో నిత్యం అనేక మంది భక్తులు వస్తుంటారు. ప్లాస్టిక్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో ప్లాస్టిక్‌ వస్తువులన్నీ గోదావరిలోనే పడేస్తున్నారు.

ఇది రాయికల్‌లోని ఓ మురికికాలువ. మున్సిపాలిటీలో బాటిల్‌నెట్స్‌ లేకపోవడంతో డైనేజీల్లోనే ప్లాస్టిక్‌ వస్తువులు పడేస్తున్నారు. ప్లాస్టిక్‌తో పూర్తిగా నిండిపోవడంతో మురికినీరు కదలలేక ప్రజలకు ఇబ్బందిగా మారింది.

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌1
1/8

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌2
2/8

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌3
3/8

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌4
4/8

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌5
5/8

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌6
6/8

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌7
7/8

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌8
8/8

బాటిల్‌నెట్‌ @ నోయూజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement