కోరుట్లరూరల్: కోరుట్ల మున్సిపల్ పరిధి యెఖీన్‌పూర్‌లో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆరోగ్య కేంద్రాల సేవలపై డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అవగాహన కల్పించారు. క్వాలిటీ అసెస్‌మెంట్ మేనేజర్ నాగరాజు ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ వసతులను వివరించారు. అనంతరం డీఎంహెచ్‌వో హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ నాణ్యతను పరీక్షించారు. వసతులు, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో 168 రకాల మందులు ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రాలు 80 మార్కులు సాధిస్తే ఏటా రూ.1.25లక్షల చొప్పున మూడేళ్లపాటు నిధులు వస్తాయని, వాటిద్వారా వసతులు కల్పించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు శ్రీనివాస్, సతీష్ కుమార్, సమీనా తబస్సుమ్, డీపీఓ రవీందర్, ఏఏంఓ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి
ఇబ్రహీంపట్నం: వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. హెల్త్ సబ్‌సెంటర్లలో మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.