గొల్లపల్లి: చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని లోత్తునూర్ గ్రామంలో డీ–64, డీ–53 డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ను మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. కాలువల్లోని పిచ్చిమ్కొలను తొలగించాలని, మరమ్మతు ప్రతిపాదనలు పంపిస్తే ఉపాధి పథకం నుంచి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆయన వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఇరిగేషన్ ఈఈ ఖాన్, అధికారులు పాల్గొన్నారు.
వైద్యసేవలు మెరుగుపర్చాలి
ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులు, ల్యాబ్, ఐపీ రికార్డ్స్, మెడికల్, ఫార్మసీని పరిశీలించారు. ఓపీ సేవలు పెంచాలన్నారు. పిచ్చిమొక్కలను తొలగించాలని ఆదేశించారు.
సాగునీటికి ఇబ్బంది రానీయొద్దు
వెల్గటూర్: సాగునీటికి ఇబ్బంది రానీయొద్దని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండలంలోని కుమ్మరిపల్లి వద్ద డీ–3, డీ–54 కెనాల్‌ను పరిశీలించారు. చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించాలన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి
జగిత్యాల: జిల్లాలో 3500 ఎకరాల్లో ఆయిల్ పాం సాగుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం ఉద్యాన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రానున్న మూడు నెలల్లో మండల వ్యవసాయాధికారులు తమ గ్రామాల ప రిధిలో 50 ఎకరాల్లో మొక్కలు నాటేలా చూడాలన్నారు. ఆయిల్ పాం సాగుతో కలిగే లాభాలను రై తులకు వివరించాలన్నారు.