ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి సన్ని ధిలో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది. స్వా మి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించి అనంతరం ఆలయాల్లో మొక్కులు చెల్లించారు. భక్తులకు ఓల్డ్ టీటీడీ కల్యాణ మండపంలో అన్నప్రసాద వితరణ చేశారు.
ఖోఖో రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా నవీన్‌కుమార్
కథలాపూర్: టఢిల్లీలో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీల తెలంగాణ జట్టు కెప్టెన్‌గా కథలాపూర్ మండలం భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్ పీడీ నవీన్‌కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో ఈ పోటీలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా నవీన్‌కుమార్ ఎంపిక కావడంపై పాఠశాల హెచ్‌ఎం నల్ల రాజయ్య, పీడీలు అభినందించారు.
బీసీలకు రూ.30వేల కోట్లు కేటాయించాలి
జగిత్యాలటౌన్: బడ్జెట్‌లో బీసీలకు రూ.30వేల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని కోరారు. 42శాతం రిజర్వేషన్ అమలయ్యేలా అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తిరుపురం రాంచంద్రం, బండపెల్లి మల్లేశ్వరి, బొమ్మిడి నరేష్, హృషికేశ్ ఉన్నారు.
రెండోరోజు కొనసాగిన అంగన్‌వాడీల ఆందోళన
జగిత్యాలటౌన్: ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని రద్దు చేయాలని, కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన ఆందోళన మంగళవారం రెండోరోజుకు చేరింది. కలెక్టరేట్ ఎదుట బైటాయించిన అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించి కలెక్టరేట్ పాలనాధికారికి వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా కో–కన్వీనర్ కోమటి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి స్వప్న, జయప్రద, సరిత పాల్గొన్నారు.
ప్రభుత్వ అసమర్థతతోనే ఎండుతున్న పంటలు
జగిత్యాలరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతోనే పంటలు ఎండుతున్నాయని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం హైదర్‌పల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. డీ–53 కెనాల్ నుంచి నీరు విడుదల చేసి పంటలు ఎండిపోకుండా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేతగాని ప్రభుత్వంలో రైతన్నల జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో మండుటెండల్లో కూడా చెరువులు మత్తళ్లు దూకాయని, మళ్లీ కేసీఆర్ పాలన వస్తేనే రైతు జీవితాలు బాగుపడతాయని వివరించారు. ఆమె వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆనందరావు, నాయకులు అంజయ్య, గంగారెడ్డి, గంగాధర్, రాజేశ్, శంకర్, దుబ్బరాజం, వెంకన్న, రాములు, వెంకటేశ్, ఆదిరెడ్డి, శేఖర్, రైతులు లైశెట్టి వెంకటేశ్, జక్కుల వెంకట్ పాల్గొన్నారు.
నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ
నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ
నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ