‘భట్టి’ బడ్జెట్‌పై ఆశలు | - | Sakshi
Sakshi News home page

‘భట్టి’ బడ్జెట్‌పై ఆశలు

Mar 19 2025 12:55 AM | Updated on Mar 19 2025 12:51 AM

సాక్షిప్రతితినిధి, కరీంనగర్‌:

నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్‌, కొత్త ప్రాజెక్టులకు వచ్చే నిధులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్మార్ట్‌ సిటీ, జగిత్యాల మెడికల్‌ కాలేజీ, ముత్యంపేట షుగర్స్‌ ఫ్యాక్టరీ, పత్తిపాక రిజర్వాయర్‌కు ఎంత కేటాయిస్తారన్న దానిపై ఉమ్మడి స్పష్టత రానుంది.

● కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా నిధులు కరీంనగర్‌ కార్పొరేషన్‌ కు రావాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేంద్రం నుంచి రూ.429 కోట్లు, రాష్ట్రం నుంచి రూ.399 కోట్లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రూ.30 కోట్ల మ్యాచింగ్‌ గ్రాంట్‌ను విడుదల చేయాలని ఇటీవల మాజీ మేయర్‌ సునీల్‌ రావు సీఎంకు లేఖ రాశారు. ఈ నిధులపై బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని బల్దియా అధికారులు ఆశాజనకంగా ఉన్నారు.

● మల్లాపూర్‌ మండలం ముత్యంపేట గ్రామం నిజాంషుగర్స్‌ బకాయిలు మొత్తం రూ.250 కోట్లు ఉన్నాయి. తొలుత రూ.43 కోట్లు, తర్వాత అది రూ.192 కోట్లకు చేరింది. మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే ఇవ్వనుంది. ఫార్చున్‌ కన్సెల్టెన్సీ ప్రతితినిధులను పిలిచి ముత్యంపేట ఫ్యాక్టరీ రిపేరు చేయాలా? కొత్తది ఇన్‌స్టాల్‌ చేయాలా? అన్న విషయాలపై నివేదిక ఇవ్వమంది. మరమ్మతులకు రూ.50 కోట్ల వరకు ఖర్చవుతుందని.. ఒకవేళ నడిపినా పదేపదే మరమ్మతుల కారణంగా నష్టాలు వస్తాయని చెప్పింది. లాభాలు రావాలంటే కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని నివేదిక ఇచ్చింది. ఈ బడ్జెట్లో దీనిపై ప్రభుత్వం ఏంనిర్ణయం తీసుకుంటుదోనని తీసుకోనుందని ఉత్కంఠగా మారింది.

● 2022–23 మెడికల్‌ కళాశాల ప్రారంభం అయ్యింది. దీని హాస్టల్స్‌ భవన నిర్మాణానికి 500 కోట్లనిధులు మంజూరు అయ్యాయి. ధరూర్‌ క్యాంపులో 27.5 ఎకరాలు కేటాయించారు. ఇప్పటివరకు విడుదలైన రూ. 30 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయి. ఇంకా 360 బెడ్స్‌ ఆసుపత్రి నిర్మాణం కావాల్సి ఉంది. ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రిలోని కొనసాగుతుంది. ఈ సారి బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

● ఉమ్మడి జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు భూములకు నీరు అందించి స్థిరీకరణ చేసేందుకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక వద్ద ఒక రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. దానికి బడ్జెట్లో చోటుఇస్తారని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి డీపీఆర్‌ కు ఆదేశించారు. సుమారు రూ.2 వేల కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుపై ఎలాంటి ప్రకటన ఉంటుందో చూడాలి.

స్మార్ట్‌ సిటీకి నిధులు దక్కేనా?

నిజాం షుగర్స్‌ పై ప్రకటనపై ఉత్కంఠ

పత్తిపాక రిజర్వాయర్‌ పనులు మొదలయ్యేనా

రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులపై ఉమ్మడి జిల్లాలో ఆసక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement