వామ్మో.. డంపింగ్‌ యార్డులు | - | Sakshi
Sakshi News home page

వామ్మో.. డంపింగ్‌ యార్డులు

Mar 19 2025 12:55 AM | Updated on Mar 19 2025 12:51 AM

● తగలబడుతున్న చెత్తాచెదారం ● కాలుష్యం బారిన పడుతున్న ప్రజలు ● నిరుపయోగంగా పొడి వనరుల కేంద్రాలు ● నిర్వహణ లేక వ్యాపిస్తున్న దుర్వాసన

జగిత్యాల: మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం.. సిబ్బంది పట్టింపు లేని ధోరణితో జిల్లాలోని ఐదు బల్దియాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం సేకరించే తడి, పొడి చెత్త గురించి పట్టించుకోకపోవడం సమస్యగా మారింది. మహిళలకు అవగాహన లేక రెండు కలిపే ఇస్తున్నారు. వాటిని అలాగే తీసుకెళ్లి డంపింగ్‌యార్డులో పోస్తున్నారు. దీంతో అక్కడ మంటలు అంటుకుని నిత్యం పొగ వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్ర జలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాకేంద్రంలో నూ కపల్లి ప్రాంతంలోని డంపింగ్‌యార్డులో నిత్యం మంటలు అంటుకున్నాయి. అక్కడ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, న్యాక్‌ కేంద్రం ఉన్నాయి. పొగంతా అ టుఇళ్లు.. ఇటు న్యాక్‌ కేంద్రాన్ని చుట్టుముట్టుతోంది. ఈ సమస్య ప్రతి మున్సిపాలిటీలోనూ నెలకొంది.

కాలుష్య కోరల్లో కాలనీలు

డంపింగ్‌యార్డులో తడి, పొడి చెత్త సేకరణ చేపట్టకపోవడంతో నిత్యం మంటలు అంటుకుని కాలనీలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. బల్దియా నిబంధనల ప్రకారం చెత్తను కాల్చకూడదు. కాలుష్యంతో నిండిన పొగతో గుండె, ఊపిరితిత్తులపై అధిక ప్రభావం పడుతుంది. మనుషుల ఆరోగ్యంతోపాటు, పర్యావరణాన్ని దెబ్బతీసే కాలుష్య కారకాల్లో పీఎం 2.5, పీఎం 10, నైట్రోజన్‌ ఆకై ్సడ్‌, సల్ఫర్‌ ఆకై ్సడ్‌ ఉంటాయి. గాలిలో పీఎం 2.5 స్థాయికి పెరిగేకొద్దీ వృద్ధులు, పిల్లలు శ్వాసకోశ వ్యాధులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. డంపింగ్‌యార్డులో పొగలు అంటుకోకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం బల్దియాలపై ఉంది.

చెత్తశుద్ధి కేంద్రాన్ని ఉపయోగంలోకి తేవాలి

ధర్మపురి శివారులో ఏర్పాటు చేసిన తడి, పొడి చెత్త కేంద్రాన్ని వినియోగంలోకి తేవాలి. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ కేంద్రం ఇప్పటివరకు నిరుపయోగంగానే ఉంది. ఈ చెత్త కేంద్రాన్ని వినియోగంలోకి తెస్తే మున్సిపాలిటీకి ఆదాయం రావడంతోపాటు, డంపింగ్‌యార్డులో చెత్త పేరుకుపోదు.

– మహేశ్‌, ధర్మపురి

చెత్తను వృథా చేయకూడదు

తడి, పొడి చెత్తను వేరుచేసి ఎరువులు తయారుచేసేలా చర్యలు తీసుకోవాలి. ఇళ్ల నుంచి తీసుకెళ్తున్న చెత్తను డంపింగ్‌యార్డులోనే పడేస్తున్నారు. దీంతో మున్సిపల్‌ ఆదాయానికి గండిపడుతోంది. అధికారులు స్పందించి చెత్తను వినియోగంలోకి తేవాలి.

– శంకర్‌, మెట్‌పల్లి

డంపింగ్‌యార్డు పొగతో ఇబ్బందులు

ఒడ్డెరకాలనీ సమీపంలోనే డంపింగ్‌యార్డు ఉంది. పట్టణంలో సేకరించిన చెత్తనంతా ఇక్కడే పోస్తున్నారు. రాత్రి సమయంలో చెత్తకు నిప్పంటించడంతో పొగ వ్యాపిస్తోంది. మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. అనారోగ్యానికి గురవుతున్నాం.

– భీమన్న, రాయికల్‌

తడి, పొడి చెత్త వేరుగా సేకరించాలి

తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. కాలనీలకు వాహనాలు వస్తు న్నా అంతా కలిపే తీసుకుంటున్నారు. ప్రజలకు అవగాహన క ల్పించాలి. డంపింగ్‌యార్డుల్లో చెత్తనంతా ఒకే చోట పోయడంతో నిత్యం మంటలు అంటుకుంటూ అందరికీ ఇబ్బందికరంగా మారింది. పొడి వనరుల కేంద్రాన్ని వినియోగంలోకి తేవాల్సి ఉంది. – సుమన్‌, జగిత్యాల

ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని సెగ్రిగేషన్‌ చేసే కేంద్రం. తడి, పొడి చెత్త వేరు చేయడం లేదు. ప్లాస్టిక్‌కు సంబంధించిన వ్యర్థాలను వేరు చేస్తున్నారే తప్ప తడి, పొడిచెత్త వేరు చేయడం లేదు. గతంలో మహిళా సంఘాలకు ఇచ్చినప్పటికీ వారు సక్రమంగా చేయకపోవడంతో ప్రస్తుతం ఎన్విరాన్‌మెంటల్‌ అధికారులే చూస్తున్నారు.

ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని డంపింగ్‌ యార్డు. యార్డులో కొద్దిరోజులుగా నిత్యం మంటలు అంటుకుంటున్నాయి. వెలువడే పొగ అక్కడున్న న్యాక్‌ కేంద్రంలోని విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సెగ్రిగేషన్‌ వ్యవస్థ లేకపోవడంతో తరచూ మంటలు అంటుకుంటున్నాయి. న్యాక్‌ కేంద్రం సమీపంలో చెత్త పోయొద్దని శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది జిల్లా కేంద్రంలో వృథాగా ఉన్న ఎరువులు తయారుచేసే కేంద్రం. తడి, పొడి చెత్త వేరు చేసిన అనంతరం దీంట్లో సేంద్రియ ఎరువును తయారుచేస్తారు. ఆ ప్రక్రియ లేకపోవడంతో వాటి కోసం నిర్మించిన షెడ్లు వృథాగానే ఉన్నాయి. ఎరువులు తయారు చేస్తే బల్దియాకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

ఇది ధర్మపురిలోని తడి, పొడి చెత్త నిర్వహణ కేంద్రం. అర్ధంతరంగా నిలిచిపోయింది. స్థలం కొరత ఏర్పడటంతో కేంద్రం పనులు ముందుకు సాగడం లేదు. తడి, పొడి చెత్త ప్రక్రియ కొనసాగడం లేదు. ఫలితంగా ఎక్కడబడితే అక్కడే చెత్త పడేస్తున్నారు.

ఇది మెట్‌పల్లి శివారులోని డంపింగ్‌యార్డు. తడి, పొడి చెత్త వేరు చేయకపోవడంతో కుప్పలు తెప్పలుగా పడి ఉంది. ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తను డంపింగ్‌యార్డుకు తీసుకొచ్చి పోస్తున్నారు. సెగ్రిగేషన్‌ చేపట్టి మున్సిపల్‌కు ఆదాయం వచ్చేలా చూడాలంటున్నారు జనాలు.

ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని డంపింగ్‌యార్డు పక్కనే నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లు. వాటి పక్కనుంచే రోడ్డు ఉంది. చెత్త నిత్యం కాలడం.. పొగ నేరుగా చివరన ఉన్న డబుల్‌బెడ్‌రూమ్‌లకు వెళ్లడం ఇబ్బందిగా మారింది.

ఇది రాయికల్‌లోని డంపింగ్‌యార్డు. ఇక్కడ తడి, పొడి చెత్త సేకరణ లేకపోవడంతో బయటన పడేస్తున్నారు. రాత్రిపూట మంటలు అంటుకోవడంతో ఇళ్లలోకి పొగ వస్తోందని చుట్టుపక్కల కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వామ్మో.. డంపింగ్‌ యార్డులు1
1/11

వామ్మో.. డంపింగ్‌ యార్డులు

వామ్మో.. డంపింగ్‌ యార్డులు2
2/11

వామ్మో.. డంపింగ్‌ యార్డులు

వామ్మో.. డంపింగ్‌ యార్డులు3
3/11

వామ్మో.. డంపింగ్‌ యార్డులు

వామ్మో.. డంపింగ్‌ యార్డులు4
4/11

వామ్మో.. డంపింగ్‌ యార్డులు

వామ్మో.. డంపింగ్‌ యార్డులు5
5/11

వామ్మో.. డంపింగ్‌ యార్డులు

వామ్మో.. డంపింగ్‌ యార్డులు6
6/11

వామ్మో.. డంపింగ్‌ యార్డులు

వామ్మో.. డంపింగ్‌ యార్డులు7
7/11

వామ్మో.. డంపింగ్‌ యార్డులు

వామ్మో.. డంపింగ్‌ యార్డులు8
8/11

వామ్మో.. డంపింగ్‌ యార్డులు

వామ్మో.. డంపింగ్‌ యార్డులు9
9/11

వామ్మో.. డంపింగ్‌ యార్డులు

వామ్మో.. డంపింగ్‌ యార్డులు10
10/11

వామ్మో.. డంపింగ్‌ యార్డులు

వామ్మో.. డంపింగ్‌ యార్డులు11
11/11

వామ్మో.. డంపింగ్‌ యార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement