వేములవాడ: రాజన్న సన్నిధిలో పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10.50 గంటలకు ఆలయ చైర్మన్ చాంబర్ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మంత్రోచ్ఛరణలు, భాజాభజంత్రీల మధ్య కల్యాణం వైభవంగా జరిగింది. ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల, మున్సిపల్ తరఫున కమిషనర్ అన్వేశ్ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయ స్థానాచార్యులు నమిలకొండ ఉమేశ్‌శర్మ ఆధ్వర్యంలో కల్యాణం జరిగింది. కన్యాదాతలుగా సురేశ్ దంపతులు, వ్యాఖ్యాతగా చంద్రగిరి శరత్‌శర్మ వ్యవహరించారు. గుడి చెరువులోని పార్కింగ్ స్థలంలో ఆలయం తరఫున అన్నదానం చేశారు. మంగళవారం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈనెల 19న సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శివయ్య పెళ్లికొడుకాయెనే..
శివయ్య పెళ్లికొడుకాయెనే..