జగిత్యాల: జిల్లాలోని బల్దియా పరిధిలోని కూరగాయల మార్కెట్లలో వసతులు లేవు. నిర్మించిన మార్కెట్లు వృథాగా ఉండటంతో వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. జిల్లాకేంద్రంలోని టవర్‌సర్కిల్‌లో కూరగాయల మార్కెట్, విద్యానగర్‌లో రైతుబజార్ ఏర్పాటు చేశారు. ఇది కొన్నేళ్లుగా వృథాగా ఉండటంతో శిథిలావస్థకు చేరింది. ఇటీవల అందుబాటులోకి తెచ్చినా.. రైతులు రైతుబజార్ ముందున్న రోడ్డుపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. ప్రజలు లోపలికి వచ్చి కొనే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులు కూడా బయటే ఉంటున్నారు. అలాగే ప్రధానంగా కొత్తబస్టాండ్, బీట్‌బజార్, హౌసింగ్‌బోర్డు, తులసీనగర్, కలెక్టరేట్ సమీపంలో రూ.9 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మించారు. విశాలమైన గద్దెలతోపాటు, రేకుల షెడ్లు వేశారు. కానీ అది పూర్తిగా నిరుపయోగంగా మారింది. ధర్మపురి మున్సిపల్‌లో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ రైతులకు అనుగుణంగా నిర్మించకపోవడంతో రోడ్డుపైనే విక్రయిస్తున్నారు. మెట్‌పల్లిలో నిధుల లేమితో సమీకృత మార్కెట్ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది.
వసతులు కరువు
రూ.కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్లు నిర్మించినా అవి అందుబాటులోకి రాకపోవడం కూరగాయల వ్యాపారులకు తలనొప్పిగా మారింది. వారు రోడ్లపైనే విక్రయిస్తున్నారు. ప్రధాన రోడ్ల వెంట టాయిలెట్స్, తాగునీరు వసతులు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కట్టిన మార్కెట్లు వారికి అనుగుణంగా లేకపోవడంతోనే వారు లోనికి వెళ్లి అమ్మడం లేదు.
● ఇది ధర్మపురిలోని సమీకృత మార్కెట్. ఇప్పటివరకు ఇందులో కూరగాయలు విక్రయించలేదు. మార్కెట్ లోపల రైతుల కోసం నిర్మించిన గద్దెలు ఎత్తుగా.. ఇరుకుగా ఉండటంతో రైతులు అందులో అమ్మడం లేదు. బయటనే కూర్చుని కూరగాయలు అమ్ముతున్నారు. మార్కెట్‌లో వసతులు లేవని కూరగాయల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లపైనే కూరగాయల విక్రయం అటు ప్రజలకు.. ఇటు వ్యాపారులకు ఇబ్బంది
పట్టించుకోని అధికారులు
ఇది రైతుబజార్ లోపల ఖాళీగా ఉన్న స్థలం. కూరగాయల వ్యాపారులు విక్రయించుకునేందుకు ఏర్పాటు చేసిన గద్దెలు. ఇందులో హోల్‌సేల్ కూరగాయల వ్యాపారులు వారి ఇష్టానుసారంగా గద్దెలను ఆక్రమించుకున్నారు. లోపల అంత స్థలం ఉన్నా రైతుబజార్ ముందు కూరగాయలు విక్రయించడంతో ప్రతి ఒక్కరికీ ఇబ్బందికరంగా మారింది.
ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని ప్రధాన రైతుబజార్. దీనిని ఏళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. అప్పటినుంచి వృథాగా ఉన్న దీనిని ఇప్పుడిప్పుడే అందుబాటులోకి తెచ్చారు. అయితే రైతుబజార్ లోపల కూరగాయలు ఎవరూ అమ్మరు. ముందున్న రోడ్డుపైనే విక్రయిస్తుండడంతో రోడ్డంతా ట్రాఫిక్ జామ్ అవుతోంది. నిత్యం అక్కడ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. కూరగాయల వ్యాపారులను రైతుబజార్ లోపల విక్రయించేలా చూస్తే సమస్య పరిష్కారం అవుతుంది.
మార్కెట్లు అధ్వానం
మార్కెట్లు అధ్వానం
మార్కెట్లు అధ్వానం
మార్కెట్లు అధ్వానం
మార్కెట్లు అధ్వానం