● చెరువులు, కుంటల్లో తగ్గిన భూగర్భజలం ● ఉన్న నీరు పూర్తిగా కలుషితమయం
● అనారోగ్యం బారిన పడుతున్న జనాలు ● ఎక్కడ చూసినా పైప్‌లైన్ లీకేజీలే..
● ఇది ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం నుంచి మెట్‌పల్లికి వస్తున్న నీరు. నెలరోజులుగా పూర్తిగా రంగు మారి వస్తున్నాయి. ఈ నీటిని తాగేందుకు ప్రజలు జంకుతున్నారు. అంతటా లీకేజీలు ఉండటంతో నీరంతా బురదమయంగా వస్తోంది. ఫలితంగా ప్రజలు తాగునీటిని కొనుగోలు చేసుకుంటున్నారు.
ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని ప్రజలకు తాగునీరు అందించే ధర్మసముద్రం. మిషన్ భగీరథ నీరు రాకుంటే ఈ చెరువు నుంచి సరఫరా చేస్తారు. ఈ చెరువు నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వస్తోంది. వేసవి మొదలుకావడం.. ఎండలు మండడంతో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోతే పట్టణ ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. మిషన్ భగీరథ నీరు చాలా తక్కువగా వస్తున్నాయి. దీంతో ప్రజలకు వేసవి గట్టెక్కుతుందా..? లేదా..? అన్న సంశయం నెలకొంది.
●
ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు
ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు