ఏప్రిల్‌ వరకు సాగునీరందించండి | - | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ వరకు సాగునీరందించండి

Mar 17 2025 10:19 AM | Updated on Mar 17 2025 11:10 AM

● ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని కోరిన రైతులు

సారంగాపూర్‌: యాసంగిలో సాగు చేసిన పంటలకు ఏప్రిల్‌ చివరి వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు ఆదివారం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని కోరారు. బీర్‌పూర్‌ మండలం తుంగూర్‌, బీర్‌పూర్‌ గ్రామాల్లో జీవన్‌రెడ్డి పర్యటించగా.. రైతులు ఆయనతో మొరపెట్టుకున్నారు. రోళ్లవాగు ప్రాజెక్టు నుంచి మొన్నటి వరకు చివరి భూములకు చేరిందని, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద మరో రెండు తడులు నీరు అందుతుందని, అయితే ఏప్రిల్‌ చివరి వరకు నీరు అందించేలా చూస్తే పంటలు ఎండకుండా ఉంటాయని పేర్కొన్నారు. స్పందించిన జీవన్‌రెడ్డి విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట విండో చైర్మన్‌ పొల్సాని నవీన్‌రావు, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ బల్మూరి లక్ష్మణ్‌రావు, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్‌, కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి గుడిసె జితేందర్‌ ఉన్నారు.

కంట్రోల్‌ రూం ఏర్పాటు

డీఈవో రాము

జగిత్యాల: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిమిత్తం కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసినట్లు డీఈవో రాము తెలిపారు. విద్యార్థులకు ఏదైనా సమాచారం కావాలంటే కంట్రోల్‌రూం నంబరు 94947 80085లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. విషయ సందేహాల నివృత్తి కోసం ఫోన్‌ఇన్‌ చేపట్టామని, సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌కు సంబంధించిన నంబర్లు ఇప్పటికే పంపించామని వివరించారు.

స్వయం ఉపాధికి సబ్‌ప్లాన్‌ నిధులు అందించాలి

పెగడపల్లి: దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమ పథకాలకు అందించాలని డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాళ్లపల్లి లక్ష్మణ్‌ అన్నారు. మండలకేంద్రంలో జిల్లా అధ్యక్షుడు మణుగూరు హనుమంతు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు ఎస్సీలకే కేటాయించాలన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను దళితబంధు కింద గత ప్రభుత్వం రూ.10లక్షలు ఇస్తే.. అంబేడ్కర్‌ అభయ హస్తం కింద రూ.12లక్షలు ఇస్తామని రేవంత్‌ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఎస్సీల జనాభాకు అనుగుణంగా 20శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా.. 16 శాతం కేటాయించారని అన్నారు. డీహెచ్‌పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగురాల భూమేశ్వర్‌, శనిగరపు ప్రవీణ్‌, రామిల్ల రాంబాబు, మంథని రాజు, ఇరుగురాల శ్రీనివాస్‌, గంగనర్సయ్య, మంతెన స్వామి, సుంకె ప్రకాశ్‌, ఆత్మకూరు రాజేశ్‌, బొమ్మల స్వామి, కుంటాల లచ్చయ్య, కొత్తూరు నర్సయ్య, మల్లారపు నర్సయ్య పాల్గొన్నారు.

ధ్యానంతో ఉన్నత స్థితికి

కోరుట్ల: ధ్యానంతో ఉన్నత స్థితికి చేరుకోవచ్చని రామచంద్ర మిషన్‌ యోగా ట్రైనర్‌ హరికృష్ణ అన్నారు. పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో మూడు రోజుల ఉచిత యోగా శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ధ్యానంతో ఆధ్యాత్మికత, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మోటూరి రాజు, కేఎల్‌ఎన్‌.కృష్ణ, పడిగెల శ్రీనివాస్‌, మంచాల జగన్‌, మంచాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్‌ వరకు   సాగునీరందించండి
1
1/2

ఏప్రిల్‌ వరకు సాగునీరందించండి

ఏప్రిల్‌ వరకు   సాగునీరందించండి
2
2/2

ఏప్రిల్‌ వరకు సాగునీరందించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement