● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాలరూరల్: విద్యార్థులకు సులభతరమైన వి ద్యాబోధన అందించేందుకు అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విద్యా విధానం ప్రవేశపెట్టడం జరిగిందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం జగిత్యాల రూ రల్ మండలం జాబితాపూర్‌లో ఏఐ ద్వారా విద్యాబోధనను ప్రారంభించారు. జిల్లాలో 21 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ ద్వారా బోధన ప్రారంభమైందన్నా రు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 3–5వ తరగతుల విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాల పెంపే ల క్ష్యంగా ఏఐ ద్వారా విద్య బోధిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో మధుసూదన్, డీఈవో రాము, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం అండ
జగిత్యాల: దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో భవిత కేంద్రంలో ఉపకరణాలు అందజేశారు. డీఈవో రాము, జిల్లా కోఆర్డినేటర్ మహేశ్, ఆర్పీలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
జిల్లాలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. అదనపు కలెక్టర్ లత, డీఆర్డీవో రఘువరన్, మదన్‌మోహన్ పాల్గొన్నారు.