మెట్‌పల్లిరూరల్ (కోరుట్ల): జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లో మల్లన్న స్వామి జాతరకు సంబంధించిన భద్రత ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కింగ్, అత్యవసర సేవలు, బందోబస్తు తదితర విషయాలపై సిబ్బందితో చర్చించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతరకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేశ్, ఎస్సైలు శ్రీకాంత్, శ్యాంరాజ్, నవీన్ తదితరులు ఉన్నారు.
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట
జగిత్యాలటౌన్: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుగుణ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో జరిగిన సమావేశానికి హాజరై సభ్యత్వ నమోదును పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో తెలంగాణ దేశంలోనే ముందుండడం శుభపరిణామమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా నాయకులు సత్తా చాటాలని సూచించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవిందమ్మ, కార్యదర్శి సుమలత, జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి, సరిత, పిప్పరి అనిత, మంజుల, పద్మ, లావణ్య, మచ్చ కవిత, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.
మొక్కజొన్న పంట పరిశీలన
మేడిపల్లి(వేములవాడ): మండలంలోని పొరుమల్ల గ్రామంలో శనివారం జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, కరీంనగర్ మొక్కజొన్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు పంటలను పరిశీలించారు. పంట స్థితిగతులు, దిగుబడి, వచ్చే సీజన్‌లో ఉండబోయే డిమాండ్ గురించి రైతులతో చర్చించారు. మండల వ్యవసాయ అధికారి ఎండీ షాహిద్‌అలీ, విస్తరణ అధికారులు మంజుల, సృజన, రైతులు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
భక్తులకు ఇబ్బందులు కలగొద్దు