మెట్‌పల్లి(కోరుట్ల): వినియోగదారుల భద్రతకు ప్రత్యేక చట్టాలున్నాయని, వాటిని వినియోగించుకోవాలని సీనియర్ సివిల్ కోర్టు మెజిస్ట్రేట్ నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలన్నారు. వ్యాపారులు మోసాలకు పాల్పడితే న్యాయం కోసం కోర్టులు లేదా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాలని పేర్కొన్నారు. మోసాలకు గురైతే తప్పకుండా న్యాయ పోరాటం చేయాలని సూచించారు. కా ర్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.లింబాద్రి, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్, పన్ను వసూళ్లపై దృష్టి సారించండి
రాయికల్(జగిత్యాల): రాయికల్ బల్దియాలోని ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ లత కోరారు. శనివారం బల్దియాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారని ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ఇంటి స్థల యజమానులకు తప్పనిసరిగా ఫోన్ చేసి 25 శాతం రాయితీ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. బల్దియాలోని గృహ, వర్తక వ్యాపారస్తులు సకాలంలో పన్ను చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వేసవి దృష్ట్యా పట్టణంలో తాగునీటి సమస్య ఉంటే చర్యలు చేపట్టాలని కమిషనర్ మనోహర్‌గౌడ్‌ను ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ ఖయ్యూం, మేనేజర్ వెంకటి, టీపీవో ప్రవీణ్‌కుమార్, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్ పాల్గొన్నారు.
ఫోన్ ఇన్ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి
జగిత్యాల: ఫోన్ ఇన్ కార్యక్రమం సద్విని యోగం చేసుకోవాలని డీఈవో రాము పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేయగా డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలని, రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్యలో ఫోన్ చేసి సందేహాలు తెలుసుకోవచ్చన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి ప్రథమస్థానంలో నిలిచేలా చూడాలన్నారు. సెక్టోరియల్ అధికారి కొక్కుల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
యూనిఫాంతయారీపై అవగాహన ఉండాలి
జగిత్యాలరూరల్: యూనిఫాం తయారీపై మహిళ సంఘాలు అవగాహన పెంచుకోవాలని సెర్ఫ్ డీపీఎం విజయభారతి అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో దుస్తులు కుట్టే మహిళ సంఘ సభ్యులతో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మూనిఫాం తయారీ వేగవంతం చేయాలన్నారు. ఎవరికై నా ఆధునిక జాకీకుట్టు మిషన్లు, ఖాజాలు, గుండీలు కుట్టే మిషన్లు అవసరం ఉంటే వారికి కొనుగోలు చేసేందుకు రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏపీఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారుల భద్రతకు ప్రత్యేక చట్టాలు
వినియోగదారుల భద్రతకు ప్రత్యేక చట్టాలు
వినియోగదారుల భద్రతకు ప్రత్యేక చట్టాలు