వెల్గటూర్(ధర్మపురి): ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి కల్యాణం శుక్రవారం కన్నులపండువగా నిర్వహించారు. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వేదికపై ఉత్సవమూర్తులకు వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణలతో కల్యాణ క్రతువును కన్నుల పండువగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ ముఖ్య అథితిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విప్ అడ్లూరికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, డా.గురువారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేశ్, గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.