మెట్‌పల్లి(కోరుట్ల): పట్టణంలోని మినీ స్టేడియంలో శుక్రవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. పోటీలకు పలు మండలాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–14,16,18,20 విభాగాల్లో నిర్వహించిన పలు పోటీల్లో 20మంది ప్రతిభ చూపారు. వీరిని ఈనెల 23న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాందాస్, వ్యాయమ ఉపాధ్యాయులు స్వప్న, కార్తీక్, ప్రశాంత్, వేణు తదితరులున్నారు.