ధర్మపురి: గోవిందనామ స్మరణతో శుక్రవారం బ్రహ్మపుష్కరిణి మారుమోగింది. ఽ
దర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలోని బ్రహ్మపుష్కరిణిలో నృసింహుని డోలోత్సవం, తెప్పోత్సవం ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. స్వామివారలను హంసవాహనంపై కోనేరులో ఐదు ప్రదక్షిణలు చేసి తెప్పోత్సవం, భోగ మండపంలోని ఊయలపై డోలోత్సవం నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి వేడుకలను తిలకించారు. విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందుతు తలెత్తకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, బాదినేని రాజేందర్, ఎస్.దినేశ్, వేముల రాజు తదితరులు పాల్గొన్నారు.