జగిత్యాలక్రైం/మెట్‌పల్లి: జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లను గురువారం అర్ధరాత్రి ఎస్పీ అశోక్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జగిత్యాలటౌన్, కోరుట్ల, మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్, పలు ప్రాంతాల్లో పర్యటించి పోలీసుల పెట్రోలింగ్‌ను ప్రత్యక్షంగా పరిశీలించారు. మెట్‌పల్లి ఠాణాలో సిబ్బంది, రాత్రి డ్యూటీ వివరాలు తెలుసుకున్నారు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న సీఐ, ఎస్‌ఐ ఏ ప్రాంతంలో ఉన్నారంటూ ఫోన్ చేసి ఆరా తీశారు. కామునిదహన వేడుకల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కోటేశ్వరస్వామి సేవలో డీఈవో
వెల్గటూర్(ధర్మపురి): కోటిలింగాలలోని కోటేశ్వరస్వామిని శుక్రవారం జిల్లా విద్యాధికారి రాము కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వచనం అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం డీఈవో గోదావరినదిలో బోటింగ్ చేశారు. ధర్మపురి ఎంఈవో సీతాలక్ష్మి, ఉపాధ్యాయ సంఘం నాయకులు గోవర్ధన్, భీమయ్య, పవన్‌కుమార్, సీఆర్పీ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం
కోరుట్ల: కోరుట్ల ఆర్టీసీ డిపోలో శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ మనోహర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కోరుట్ల డిపో పరిధిలోని పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు తమ సమస్యలు, సలహాలు, సూచనలు 83745 34961 నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
ఎస్పీ ఆకస్మిక తనిఖీ