గిట్టుబాటు ధర కోసం పోరుబాట | - | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు ధర కోసం పోరుబాట

Mar 10 2025 10:44 AM | Updated on Mar 10 2025 10:39 AM

● చలో మెట్‌పల్లికి పిలుపునిచ్చిన రైతు ఐక్య వేదిక ● ఈనెల 11న మార్కెట్‌ యార్డు ఎదుట ఆందోళన

కోరుట్లరూరల్‌: పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ఆందోళన చేపట్టనున్నారు. మెట్‌పల్లి మార్కెట్‌ యార్డు ముందు ధర్నా చేపట్టి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈనెల 11న శ్రీచలో మెట్‌పల్లిశ్రీ పేరుతో ఆందోళనకు రైతులు పిలుపునిచ్చారు. రైతు సంఘం నాయకుడు, రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో పసుపు కల్లాల వద్ద రైతులను కలిసి మద్దతు కోరారు. కేంద్రప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ మద్దతు ధర కల్పించటం లేదని, ధర తక్కువగా ఉండడంతో పంట పండించిన రైతులకు నష్టాలే మిగులుతున్నాయ ని వివరిస్తున్నారు. గతేడాదితో పోల్చితే పసుపు పంటకు ఈ సారి తక్కువ ధర ఉండటం రైతుల ను ఆందోళన కలిగిస్తోంది. పసుపు బోర్డు ఏర్పా టు సమయంలో సంబరాలు జరుపుకున్న రైతులు.. మద్దతు ధర కల్పించకపోవటంతో పోరుబాటకు సిద్ధమవుతున్నారు.

వైఎస్సార్‌ హయాంలో మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి హయాంలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం ద్వారా పసుపు పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేశారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పసుపు పంటకు ఆశించిన ధర లేనప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహ న్‌ రెడ్డి కూడా ఈ పథకం ద్వారా ప్రభుత్వమే కొ నుగోళ్లు చేపట్టారని రైతు నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా అదే పథకాన్ని వర్తింపజే సి రాష్ట్రంలో పసుపు క్వింటాల్‌కు కనీసం రూ.15 వేలు చె ల్లిస్తూ.. ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. పలువురు రైతు సంఘ నాయకులు కోరుట్ల మండలంలోని వెంకటాపూర్‌, చిన్నమెట్‌పల్లి, జోగిన్‌పల్లి గ్రామాల్లో పసుపు రైతులను కలిసి మద్దతు కోరారు. మెట్‌పల్లిలో ని ర్వహించే ధర్నాకు తరలిరావాలని పిలుపుని చ్చా రు. కార్యక్రమంలో వెంకటాపూర్‌ మాజీ స ర్పంచ్‌ తోట లింగారెడ్డి, దాగె వెంకటేష్‌, దాగె గంగాదర్‌, మహేష్‌, లక్ష్మారెడ్డి, శేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement