సారంగాపూర్:మండలంలోని దుబ్బరాజన్న ఆలయం ఆవరణలో శ్రీవేంకటేశ్వరస్వామి, అలివేలుమంగ,
పద్మావతిదేవి కల్యాణాన్ని ఆలయ అర్చకులు ఆదివారం కనులపండువగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు మంగళవాయిద్యాల
మధ్య శోభాయాత్ర చేపట్టారు. పెంబట్ల, కోనాపూర్, పోచంపేట గ్రామాల నుంచి మహిళలు 108 కలశాలను కల్యాణం కోసం తీసుకొచ్చారు. ఆలయ ఈవో అనూష, వ్యవస్థాపక ధర్మకర్త పొరండ్ల శంకరయ్య, విండో చైర్మన్ గుర్నాథం మల్లారెడ్డి, నాయకులు కోండ్ర రాంచంద్రారెడ్డి, తోడేటి శేఖర్‌గౌడ్, వాసం శ్రీనివాస్, పంగ కిష్టయ్య, తోడేటి గోపాల్‌కిషన్, కాలగిరి బాపురెడ్డి, కొంగరి లింగరెడ్డి, బొక్కల సునిత, భక్తులు పాల్గొన్నారు.
కమనీయం శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం